iDreamPost

హైదరాబాద్​లో BCCI ఫంక్షన్.. సందడి చేయనున్న టీమిండియా, ఇంగ్లండ్ ప్లేయర్లు!

  • Published Jan 10, 2024 | 12:22 PMUpdated Jan 10, 2024 | 12:22 PM

భారత క్రికెట్ బోర్డు హైదరాబాద్​లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో టీమిండియాతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా సందడి చేయనున్నారు. ఏంటా ఫంక్షన్? ఎందుకంత స్పెషల్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ బోర్డు హైదరాబాద్​లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో టీమిండియాతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా సందడి చేయనున్నారు. ఏంటా ఫంక్షన్? ఎందుకంత స్పెషల్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 10, 2024 | 12:22 PMUpdated Jan 10, 2024 | 12:22 PM
హైదరాబాద్​లో BCCI ఫంక్షన్.. సందడి చేయనున్న టీమిండియా, ఇంగ్లండ్ ప్లేయర్లు!

సౌతాఫ్రికా టూర్​ను ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా మరో సిరీస్​కు రెడీ అవుతోంది. ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20లు ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్-2024 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్​తో సిరీస్​ను సీరియస్​గా తీసుకుంటోంది భారత్. వరల్డ్ కప్​కు ముందు రోహిత్ సేన ఆడే ఆఖరి టీ20 సిరీస్​ ఇదే కానుంది. కాబట్టి టీమ్ కాంబినేషన్, ఏయే ప్లేయర్లను ఎక్కడెక్కడ ఆడించాలనే విషయాలపై ఇప్పుడే ఓ క్లారిటీకి రావాల్సి ఉంటుంది. ప్రయోగాలు, మార్పుచేర్పులపై అవగాహనకు రావాలంటే ఆఫ్ఘాన్​తో సిరీసే ఆఖరి ఛాన్స్. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్​తో 5 టెస్టులు ఆడనుంది టీమిండియా. అయితే ఫస్ట్ టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్​కు భారత, ఇంగ్లీష్ క్రికెటర్లు కాస్త ముందే వచ్చి సందడి చేయనున్నారు. భాగ్యనగరంలో బీసీసీఐ యానువల్ ఫంక్షన్ నిర్వహిస్తుండటమే దీనికి కారణం.

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జనవరి 25వ తేదీన టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందే హైదరాబాద్​లో ఇరు జట్ల క్రికెటర్లు​ సందడి చేయనున్నారు. ఈ నెల 23న భాగ్యనగరంలో భారత క్రికెట్ బోర్డు యానువల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత నాలుగేళ్లలో బీసీసీఐ నిర్వహిస్తున్న తొలి యానువల్ ఫంక్షన్ ఇదే కావడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బోర్డు ఆపేసింది. అయితే పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈసారి ఫంక్షన్ నిర్వహించాలని డిసైడ్ అయింది. అందుకు వేదికగా హైదరాబాద్​ను సెలక్ట్ చేసింది. నాలుగేళ్లుగా పురస్కారాలు ప్రదానం చేయలేదు కాబట్టి విన్నర్స్ లిస్ట్ పెద్దగానే ఉండనుంది. చివరగా 2020లో ముంబై వేదికగా ఈ అవార్డు ఫంక్షన్ పెట్టారు. 2018-19 ఏడాదికి సంబంధించిన పురస్కారాలను అప్పుడు ప్రకటించారు. ఆ సంవత్సరమే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్​గా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ‘పాలీ ఉమ్రిగర్’ అవార్డును అందుకున్నాడు.

team india cricketers in hyderabad

ఈసారి బీసీసీఐ అవార్డులను ఎవరెవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే జనవరి 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. టీమిండియాతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా అటెండ్ కానుండటంతో ఈసారి యానువల్ అవార్డు ఫంక్షన్​ మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక, ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​లో పేసర్​ మహ్మద్ షమి ఆడేది అనుమానంగా మారింది. వరల్డ్ కప్ టైమ్​లో గాయపడిన ఈ స్పీడ్​స్టర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్​తో సిరీస్​కల్లా రికవర్ అవుతానని అర్జున అవార్డుల కార్యక్రమంలో షమి తెలిపాడు. కానీ ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకుండా ఆడిస్తే భవిష్యత్తులో గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మొదటి రెండు టెస్టులకు అతడ్ని దూరంగా ఉంచాలని బీసీసీఐ డిసైడ్ అయిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదీ చదవండి: ఉప్పల్‌లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్రీ ఎంట్రీ.. వారికి మాత్రమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి