iDreamPost
android-app
ios-app

వీడియో: ట్రాలీలో అంతర్జాతీయ క్రికెటర్ల లగేజ్ తరలింపు! ఇదేం ఆతిథ్యం సామి?

  • Published Apr 25, 2024 | 3:20 PM Updated Updated Apr 25, 2024 | 3:20 PM

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు.

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు.

  • Published Apr 25, 2024 | 3:20 PMUpdated Apr 25, 2024 | 3:20 PM
వీడియో: ట్రాలీలో అంతర్జాతీయ క్రికెటర్ల లగేజ్ తరలింపు! ఇదేం ఆతిథ్యం సామి?

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు. ఎయిర్​పోర్ట్​లో దిగినప్పటి నుంచి తిరిగి స్వదేశానికి పయనమయ్యేంత వరకు వారికి ఓ రేంజ్​లో అతిథి మర్యాదలు చేస్తారు. లగ్జరీ హోటల్స్ బుక్ చేయడం, టేస్టీ ఫుడ్​ అరేంజ్ చేయడం, టైట్ సెక్యూరిటీ, టాప్ క్లాస్ వెహికిల్స్​లో వాళ్లను తిప్పుతూ ఆ దేశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంటారు. పెద్ద దేశాలనే కాదు.. స్మాల్ కంట్రీస్ కూడా ఆతిథ్యంలో తమకు అయినంతలో మంచి ఏర్పాట్లు చేస్తూ ఆటగాళ్ల మనసుల్ని దోచుకుంటాయి. అయితే ఓ దేశం మాత్రం ఈ విషయంలో ప్రవర్తించిన తీరుకు విమర్శలు మూటగట్టుకుంటోంది.

టీ20 సిరీస్​లో భాగంగా నేపాల్​ పర్యటనకు వచ్చింది వెస్టిండీస్-ఏ జట్టు. మ్యాచులు ఆడటంతో పాటు నేపాల్​ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయాలని ప్లేయర్లు అనుకున్నారు. కానీ వారికి ఎయిర్​పోర్ట్​లోనే చుక్కెదురైంది. విండీస్ ఆటగాళ్ల కోసం నేపాల్ సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం వాళ్ల లగేజ్ తీసుకెళ్లేందుకు కూడా వెహికిల్స్ అరేంజ్ చేయలేదు. ఓ ట్రాలీలో లగేజ్​ను తరలించారు. ఎయిర్​పోర్ట్​లో నుంచి బయటకు రాగానే సాదాసీదా ఆటోలో క్రికెటర్లు తమ బ్యాగులు, సూట్​కేస్​లను పెట్టి బస్సు ఎక్కి హోటల్​కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కరీబియన్ ఆటగాళ్ల లగేజ్ తీసుకెళ్లేందుకు సాధారణ ఆటోను అందుబాటులో ఉంచిన నేపాల్ క్రికెట్ బోర్డు.. వాళ్లు ప్రయాణించేందుకు కూడా ఆర్డినరీ టూరిస్ట్ బస్​ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. క్రికెట్​లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టీమ్ ఇలాంటి చర్యలతో పరువు పోగొట్టుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లు విజిట్ కోసం వస్తే ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఏంటని షాకవుతున్నారు. మున్ముందు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే క్రికెట్ వరల్డ్​లో ఆ దేశం మరింత అభాసు పాలవడం పక్కా అని చెబుతున్నారు. మరి.. విండీస్ క్రికెటర్ల కోసం నేపాల్ బోర్డు చేసిన ఏర్పాట్లపై వస్తున్న విమర్శల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.