iDreamPost
android-app
ios-app

ఇంటి యజమానురాలిపై కన్నేసిన డ్రైవర్! ఎవరూ లేని టైమ్ చూసి..!

  • Published Jul 11, 2023 | 3:43 PM Updated Updated Jul 11, 2023 | 4:31 PM
  • Published Jul 11, 2023 | 3:43 PMUpdated Jul 11, 2023 | 4:31 PM
ఇంటి యజమానురాలిపై కన్నేసిన డ్రైవర్! ఎవరూ లేని టైమ్ చూసి..!

విజయవాడలోని మారూతీనగర్ లో కిరణ్ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇతడు గత 15 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆ ఇంటి యజమానురాలితో పరిచయం పెంచుకున్నాడు. దీంతో అతడు మెల్లగా మెల్లగా ఆమెకు ఇంకాస్త దగ్గరయ్యాడు. అయితే, ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ కారు డ్రైవర్ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలిని నమ్మించి కిరాతకానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ మారుతీనగర్ లోని ఓ ఇంటి పెంట్ హౌజ్ లో బర్రె కిరణ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. కాగా, ఈ యువకుడు రాను రాను ఆ ఇంటి యజమానురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతోనే ఇతడు ఆమెకు ఇంకాస్త దగ్గరయ్యాడు. అలా వీరిద్దరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా మారిపోయింది. దీంతో ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుస్తూ తెగ ఎంజాయ్ చేశారు. వీరి చీకటి సంసారం ఏకంగా 15 ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే.. ప్రియురాలు అర్థరాత్రి దాటినా కూడా వాట్సాప్ లో ఆన్ లైన్ లో ఉండడం, ఎక్కువగా ఫోన్ లు మాట్లాడుతుండడంతో కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. నాతో కాకుండా మరొక యువకుడికి దగ్గరైందని భావించాడు.

ఈ క్రమంలోనే కిరణ్ ఆ ఇంటి ఓనర్ పై పగ పెంచుకుని ఆమెను చంపాలని ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే తన ప్రియురాలిని నమ్మించి కారులో కృష్ణా జిల్లా ముస్తాబాద్ శివారుకు తీసుకెళ్లాడు. ఓ చోట కారు ఆపి ఎవరూ లేని టైమ్ లో.. నువ్వు మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నావా అంటూ గట్టిగా ప్రశ్నించాడు. ఇదే విషయంపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన కిరణ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ మహిళా.. వెంటనే కారు దిగి పెద్దగా అరిచింది. స్థానికులు గమనించి అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడ చదవండి: వీడియో: నడిరోడ్డుపై పోలీసుపై దాడి చేసిన యువకుడు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş