iDreamPost

ఖుషి ట్రైలర్ రిలీజ్.. భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న రౌడీ హీరో!

ఖుషి ట్రైలర్ రిలీజ్.. భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న రౌడీ హీరో!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఖుషి కూడా ఒకటి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్ స్టా రీల్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంఛ్ చేశారు. మరి.. విజయ్ దేవరకొండ– సమంత కాంబో ఎలా ఉంది? ఈ సినిమా స్టోరీ ఏంటి? ఈ ట్రైలర్ ఆడియన్స్ కి ఎలా అనిపించవచ్చు? అనే విషయాలు చూద్దాం.

ఇప్పటి వరకు ఖుషి సినిమా అనగానే అందరూ.. సమంత కశ్మీర్ ముస్లిమ్, విజయ్ కశ్మీర్ టూర్ వెళ్లి ఆమెను కలుస్తాడు. ఆ తర్వాత ఆమె ప్రేమలో పడిపోతాడు అని చాలానే ఊహించుకున్నారు. అయితే అవన్నీ జస్ట్ మన భ్రమలే అని ఈ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆమె బేగం కాదని.. బ్రాహ్మిన్ అని తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఇంకో సమస్య పెట్టారు. హీరో హీరోయిన్ ఇద్దరూ వేరు వేరు మతాలకు చెందిన వారిని చేశారు. పెద్దలు అంగీకరించకపోయినా విజయ్- సమంత వివాహం చేసుకున్నారు. వాళ్లు బెస్ట్ కపుల్ అని అందరికీ ప్రూవ్ చేయాలి అనుకుని మొదలు పెట్టిన వారి వైవాహిక జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనే విషయాన్నే ఈ ట్రైలర్ లో చూపించారు.

చివరికి వాళ్లు అనుకున్నది సాధించారా? లేదా అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ స్టోరీ లైన్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కాస్త ఫ్రెష్ లుక్ ఉంది. డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్, విజయ్, సమంత బిగ్ అసెట్ అనే చెప్పాలి. ఈ స్టోరీ లైన్ కు కచ్చితంగా ఈ జనరేషన్ భార్యలు, భర్తలు, ప్రేమికులు కనెక్ట్ అవుతారు. కొన్ని పాత్రలను వెండితెర మీద చూసుకుని ప్రేక్షకులు తమనే ఊహించుకుంటారు. అలాంటి స్కోప్ ఈ కథలో చాలా కనిపిస్తోంది. అందుకే సాధారణ ఆడియన్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూత్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. మొత్తం మీద ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే. మరి.. విజయ్- సమంతల ఖుషి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి