iDreamPost
android-app
ios-app

ఖుషీ టీమ్ రిస్క్ తీసుకుంటోందా? కంగారులో ఫ్యాన్స్..!

ఖుషీ టీమ్ రిస్క్ తీసుకుంటోందా? కంగారులో ఫ్యాన్స్..!

ఖుషీ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ– సమంత కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్లే ఈ హైప్ అని చెప్పవచ్చు. మరోవైపు శివ నిర్వాణ సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఖుషీ సినిమాకి సంబంధించి సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ లో ఒకింత కంగారు నెలకొంది.

ఖుషీ సినిమాపై మొదటి నుంచి ఫ్యాన్స్, ఇండస్ట్రీలో చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ముందే ఫిక్స్ అయిపోయారు. పైగా ఈ సినిమాకి యూ సర్టిఫికేషన్ వస్తుందని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్ కూడా నడిచింది. కానీ, ఈ సినిమాకి యూఏ సర్టిఫికేషన్ వచ్చింది. అయితే ఫ్యాన్స్ కంగారు ఈ సర్టిఫికేషన్ గురించి అయితే కాదు. ఈ సినిమాకి సంబంధించిన డ్యూరేషన్ విషయంలో సమంత, విజయ్ ఫ్యాన్స్ లో కాస్త కంగారు నెలకొందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిడివి 165 నిమిషాలుగా ఉంది. అంటే రెండు గంటల 45 నిమిషాలు అనమాట. సాధారణంగా తెలుగులో చాలా సినిమాల నిడివి కేవలం 2.30 గంటలలోపే ఉంటుంది.

రొటీన్ కంటే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ ఉండటంతో ఖుషీ టీమ్ రిస్క్ తీసుకుంటోంది అని భావిస్తున్నారు. అయితే ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంగీకరించాల్సింది ఏంటంటే.. సినిమా అనేది గతంతో పోలిస్తే చాలా మారింది. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు.. చాలా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఎక్కువ నిడివిగల సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అవి మంచి సక్సెస్ కూడా అయ్యాయి. ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టే సత్తా ఉంటే 6 గంటల సినిమాని అయినా కన్నార్పకుండా చూస్తారు. అయితే ఆ టాలెంట్ డైరెక్ట్ ర్ లో ఉండాలి. ఖుషీ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ కావడంతో ఫ్యాన్స్ కాస్త నిశ్చింతగానే ఉండచ్చు. ఎందుకంటే ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడం మాత్రమే కాదు.. వాటిని క్యారీ చేయడం కూడా శివ నిర్వాణకు బాగా తెలుసని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు.

కేవలం నిడివి విషయంలో అయితే ఫ్యాన్స్ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరమే లేదని చెప్పచ్చు. ఫీల్ గుడ్ లవ్ అయ్యి.. స్టోరీ ఎంగేజింగా ఉంటే.. డ్యూరేషన్ అనేది ఖుషీ సినిమాకి కచ్చితంగా ఇబ్బంది కాదు. ఇప్పటికే మంచి డైరెక్టర్ గా గుర్తింపు సాధించిన శివ నిర్వాణ అంత నిడివి పెట్టాడు అంటే తప్పకుండా బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఈ సినిమా లైన్ విషయానికి వస్తే.. దేవుడే లేడు అనే కుటుంబం నుంచి వచ్చిన హీరో బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం ఎలా ఉంటుంది? భార్యభర్తలుగా వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? వాళ్ల దాంపత్య జీవింత ఎలా ఉంటుంది? అనే లైన్ తో ఈ మూవీ ఉండబోతోంది. పైగా ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత విజయ్- సమంత పాత్రల్లో సగటు భార్యాభర్తలు తమని తాము ఊహించేసుకుంటున్నారు. అక్కడే ఖుషీ టీమ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి.