iDreamPost
android-app
ios-app

Family Star: OTTలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ స్టార్‌.. టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న మూవీ

  • Published Apr 30, 2024 | 12:52 PM Updated Updated Apr 30, 2024 | 12:52 PM

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీల్లో మాత్రం దూసుకుపోతుంది.

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీల్లో మాత్రం దూసుకుపోతుంది.

  • Published Apr 30, 2024 | 12:52 PMUpdated Apr 30, 2024 | 12:52 PM
Family Star: OTTలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ స్టార్‌.. టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న మూవీ

పని గట్టుకుని చేసే నెగిటివ్‌ ప్రచారం వల్ల ఎన్ని నష్టాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల మీద ఇలా కావాలనే నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటారు. సోషల్‌ మీడియా వేదికగా వారిని వేధింపులకు గురి చేస్తుంటారు. ఈమధ్యకాలంలో ఇలా నెగిటివ్‌ ప్రచారం వల్ల భారీగా నష్టపోయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. తనే విజయ్‌ దేవరకొండ. గత కొంత కాలంగా సరైన హిట్లు లేని విజయ్‌ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ సినిమా విడుదల కాకముందే.. ఫ్లాప్‌, చెత్త సినిమా అంటూ నెగిటివ్‌ రివ్యూలు పోస్ట్‌ చేశారు. ఆ ప్రభావం సినిమాపై బాగానే పడింది. దాంతో ఈ చిత్రం థియేటర్స్‌లో మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుని.. యావరేజ్‌గా నిలిచింది.

ఇక థియేటర్లలో అంచనాలు అందుకోలేని ఫ్యామిలీ స్టార్‌ చిత్రం.. ఓటీటీలో దూసుకుపోతుంది. ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్‌ టాక్‌ వల్ల అనుకున్న మేర విజయం సాధించలేదు. కలెక్షన్లు కూడా సరిగా రాలేదు. పైగా విడుదలైన 20 రోజులకే ఓటీటీల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇక ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌ చూసిన వారు.. చాలా బాగుంది.. కుటుంబంతో కలిసి చక్కగా ఎంజాయ్‌ చేయవచ్చు అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్స్ లో ఆకట్టుకోని ఈ సినిమా ఓటిటిలో అదరగొడుతుంది. టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

A family star that is popular in OTT

ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ సమయంలో కొందరు ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేయడంతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేదని.. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ కొందరు నెటిజనులు ట్విట్టర్‌ వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్, మృణాల్‌ జోడి బాగుందని, హీరో తన ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్‌కు ఓటీటీలో వస్తోన్న రెస్పాన్స్‌తో.. ఈ సినిమాపై వున్న నెగటివ్ ప్రచారం అంతా తేలిపోయింది.ఈ సినిమాను ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ప్రైమ్ వీడియోలో చూస్తున్నప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. దాంతో ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటిటిలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా “ఫ్యామిలీ స్టార్”. దిల్‌ రాజు నిర్మాతగా.. పరశురామ్ దర్శకత్వంలో.. ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. గతంలో పరశురామ్‌-విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం సినిమా భారీ విజయం సాధించడంతో.. ఫ్యామిలీ స్టార్‌ మీద భారీ అంచానలు ఏర్పడ్డాయి. ఇక ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

అయతే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుండే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్, సీన్స్‌పై నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేసారు. ఈ నెగిటివ్‌ ప్రచారం కాస్త సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. దీనితో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయిన 20 రోజులలోనే ఓటిటిలోకి వచ్చింది. అక్కడ మాత్రం టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş