iDreamPost
android-app
ios-app

బాలయ్యపై విజయ్ కామెంట్స్! ఆయన్ని ఇప్పటిదాకా అలా చూడలేదు!

  • Author ajaykrishna Updated - 11:18 AM, Wed - 23 August 23
  • Author ajaykrishna Updated - 11:18 AM, Wed - 23 August 23
బాలయ్యపై విజయ్ కామెంట్స్! ఆయన్ని ఇప్పటిదాకా అలా చూడలేదు!

సినీ ఈవెంట్స్ లో ఒక్కోసారి సెలబ్రిటీలు.. వేరే సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. అవి పాజిటివ్ కావచ్చు.. లేదా ఇంకేదైనా కావచ్చు. కానీ.. వారి వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ లో చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. నటసింహం బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య అంటే.. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల నుండి యంగ్ జనరేషన్ వరకు ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఏ తరం వారితోనైనా ఇట్టే కలిసి పోతుంటారు. కాగా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ఖుషి రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో తెలుగుతో పాటు ఇతర భాషలలో సినిమా రిలీజ్ అవుతుండటంతో.. ప్రమోషన్స్ కోసం అన్ని చోట్లకు వెళ్తున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీ, మెగాస్టార్ చిరు లాంటి లెజెండ్స్ గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు అటు ఫ్యాన్స్ ని, ఇటు ఇండస్ట్రీ వర్గాలను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడి.. మరోసారి ఫ్యాన్స్ ని మెప్పించాడు. బాలకృష్ణ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన విజయ్.. ఆయన తన లైఫ్ ని చిన్న పిల్లాడిలా గడిపేస్తుంటాడని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ ఆయన్ని కలిసినప్పుడు ర్యాపో సెట్ అవ్వడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆయన చిన్న పిల్లాడిలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్ధం కాలేదు.

బాలయ్య ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు.. నన్ను ప్రేమిస్తారు కాబట్టి.. నేను ఇప్పటిదాకా ఆయనలో రెండో వైపు ఎప్పుడూ చూడలేదు. నాతో ఎప్పుడూ బాగుంటారు. మీలాగే నేను కూడా బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. విజయ్, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ.. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. లవ్, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో.. ఈ సినిమాని మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. మరి ఖుషి మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom