iDreamPost

క్రైస్తవులకు విజయ్ ఆంటోనీ క్షమాపణలు! ఏమైందంటే?

  • Published Mar 21, 2024 | 3:36 PMUpdated Mar 21, 2024 | 3:36 PM

తమిళ, తెలుగు ఇండస్ట్రీస్ కు డైరెక్టర్ గా, హీరోగా అందరికి సుపరిచితుడైన వ్యక్తి.. విజయ్ ఆంటోనీ. అయితే , తాజాగా విజయ్ ఆంటోనీ క్రైస్తవ మతపెద్దలకు క్షమాపణలు చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ, తెలుగు ఇండస్ట్రీస్ కు డైరెక్టర్ గా, హీరోగా అందరికి సుపరిచితుడైన వ్యక్తి.. విజయ్ ఆంటోనీ. అయితే , తాజాగా విజయ్ ఆంటోనీ క్రైస్తవ మతపెద్దలకు క్షమాపణలు చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 21, 2024 | 3:36 PMUpdated Mar 21, 2024 | 3:36 PM
క్రైస్తవులకు విజయ్ ఆంటోనీ క్షమాపణలు! ఏమైందంటే?

సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా, హీరోగా అటు తమిళ పరిశ్రమతో పాటు, తెలుగు పరిశ్రమలో కూడా అందరికి బాగా సుపరిచితుడైన వ్యక్తి విజయ్ ఆంటోని. ఈ హీరో తీసిన సినిమాలతో పాటు.. ఈ హీరోకు కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అటు ఇండస్ట్రీలోను, ఇటు బయట కూడా విజయ్ ఆంటోనీకి మంచి పేరు ఉంది. అలానే గతంలో విజయ్ ఆంటోనీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో .. దాని నుంచి విజయ్ ఏ విధంగా కమ్ బ్యాక్ ఇస్తున్నారో కూడా.. అందరికి తెలిసిన విషయమే. అయితే, విజయ్ తాజాగా క్రైస్తవ మతపెద్దలకు క్షమాపణలు చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, విజయ్ ఆంటోని గురించి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి. అసలు దీని వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి. దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

విజయ్ ఆంటోని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన.. ఓ సందర్భంలో.. “‘మద్యం సేవించే విషయంలో స్త్రీపురుషభేదాలు చూడరాదు. మద్యం సేవించడం అనేది అన్ని జాతుల్లో సర్వసాధారణమైన అంశం. పురాతన కాలంలో కూడా మద్యం ఉండేది. దాన్ని కాలానుగుణంగా పేరు మార్చుకుంటూ వచ్చారు. సారా అనే పేరుతో గతంలో సేవించేవాళ్లం. ఇపుడు బడా కంపెనీలు ఉత్పత్తి చేసి, వివిధ రకాలైన పేర్లతో విక్రయించే మద్యాన్ని తాగుతున్నాం. యేసుక్రీస్తు కూడా ద్రాక్షరసం సేవించారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీనితో ఈ వ్యాఖ్యలు పలు వివాదాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బహిరంగంగా విజయ్ ఆంటోని క్షమాపణ చెప్పకుంటే.. ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తామని.. హెచ్చరించింది. దీనితో విజయ్ ఆంటోనీ.. అందరికి క్షమాపణలు కోరుతూ.. సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు.

Vijay

ఇక విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే.. విజయ్ ఇటీవల నటించిన రక్తం చిత్రానికి.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం విజయ్ చేతిలో తమిళ్ తో పాటు, తెలుగులోనూ పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం “రోమియో”. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోనీ.. ప్రెజెంటర్ గా ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, ఇప్పుడు విజయ్ మాటలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలుగా దారి తీయడంపై.. ఆయన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి, క్రైస్తవులకు విజయ్ ఆంటోనీ క్షమాపణలు తెలియజేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి