iDreamPost
అందులో అంతో ఇంతో అంచనాలు ఉన్నది రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' మాత్రమే. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. 25న సునామిలా విరుచుకుపడబోతున్న ఆర్ఆర్ఆర్ వచ్చేలోపు వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి.
అందులో అంతో ఇంతో అంచనాలు ఉన్నది రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' మాత్రమే. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. 25న సునామిలా విరుచుకుపడబోతున్న ఆర్ఆర్ఆర్ వచ్చేలోపు వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి.
iDreamPost
గత శుక్రవారం విడుదలైన రాధే శ్యామ్ ఫైనల్ రిజల్ట్ తేలిపోవడంతో బాక్సాఫీస్ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తోంది. ఇవాళ రిలీజవుతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ని మినహాయిస్తే రేపో మూడో రాబోతున్నాయి. అందులో అంతో ఇంతో అంచనాలు ఉన్నది రాజ్ తరుణ్ ‘స్టాండ్ అప్ రాహుల్’ మాత్రమే. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. 25న సునామిలా విరుచుకుపడబోతున్న ఆర్ఆర్ఆర్ వచ్చేలోపు వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి. ఒకవేళ రాహుల్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఎన్నో కొన్ని థియేటర్లలో ఉండొచ్చు కానీ లేదంటే వాష్ అవుటే.
దీంతో పాటు ‘నల్లమల’, ‘సంస్కార్ కాలనీ’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రేపే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇవి ఏ మేరకు జనాన్ని ఆకట్టుకుంటాయనేది అనుమానమే. టికెట్ కౌంటర్ల దగ్గర గత మూడు నాలుగు రోజులుగా పెద్ద సందడి లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ కి మల్టీ ప్లెక్సుల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. బిసి సెంటర్స్ లోనూ మంచి కలెక్షన్లు నమోదవుతున్నట్టుగా ట్రేడ్ రిపోర్ట్. సో పైన చెప్పిన మూడు సినిమాలూ ఏదో ప్రభావం చూపిస్తాయని అప్పుడే చెప్పలేం. జనాలు ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ మూడ్ లోకి వెళ్లిపోయారు. రాజమౌళి టీమ్ చేస్తున్న ప్రమోషన్లు మూవీ లవర్స్ ని అదొక్కటే ఛాయస్ అనేలా ఉన్నాయి.
అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ కూడా రేపే రానుంది. అయితే దీని మీద మనవాళ్లకు పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే ఇది గద్దలకొండ గణేష్ రీమేక్. ఆల్రెడీ చూసేసిన కథ కావడంతో అభిమానులు తప్ప ఇంకెవరు దీనికి పెద్దగా స్పందించకపోవచ్చు. ఒకవేళ జేమ్స్ కి పాజిటివ్ టాక్ వస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న సినిమాలకు థియేటర్లలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. తెలంగాణలో టికెట్ రేట్ల ధరలు మొదటి వారం ప్రయోజనం కలిగిస్తున్నా తర్వాత అవే భారంగా మారాయి. ఏపిలోనే నయమని చెప్పొచ్చు. ఫ్లాప్ టాక్ తెచ్చుకుని స్లో అయిపోయిన రాధే శ్యామ్ ఇప్పటికీ హైదరాబాద్ ప్లెక్సుల్లో 295 రూపాయలు నడవటమే దానికి ఉదాహరణ
Also Read : Raashi Khanna : ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఉంటుందా