అనసూయ ట్రోలర్స్ బారిన పడింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే అనసూయ లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏజ్డ్ లా కనిపిస్తున్నావ్, ముసలి దానిలా కనిపిస్తున్నావ్, ముఖంలో గ్లో ఏది? అని కొందరు కామెంట్స్ చేస్తే, అసలైన వయసు బయటపడింది, నీ మేకప్ డ్రెస్సింగ్ బాలేదు , ముడతలు కనిపిస్తున్నాయ్ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ ట్రోలర్స్ కి ఆమె అభిమానులు గట్టిగానే సమాధానమిస్తున్నారు. లుకింగ్ నైస్, వావ్, బ్యూటిఫుల్ అంటూ పొగుడుతున్నారు.
ఇలా అప్పుడప్పుడు నెగిటీవ్ కామెంట్స్ వచ్చినా, ఎవరైనా ట్రోల్ చేస్తున్నా, దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంది అనసూయ. చూడాలి ఈసారి ఆమె రివర్స్ డోసు ఎలా ఉంటుందో!