iDreamPost
android-app
ios-app

Krithi Shetty : ఉప్పెన భామకు అవకాశాల వెల్లువ

  • Published Mar 15, 2022 | 1:47 PM Updated Updated Mar 15, 2022 | 1:47 PM
  • Published Mar 15, 2022 | 1:47 PMUpdated Mar 15, 2022 | 1:47 PM
Krithi Shetty : ఉప్పెన భామకు అవకాశాల వెల్లువ

గత ఏడాది ఉప్పెనతో డెబ్యూ చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి కెరీర్ వైష్ణవ్ తేజ్ కంటే వేగంగా పరుగులు పెడుతోంది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు కూడా సక్సెస్ కావడంతో కృతి ఇప్పుడు లక్కీ గర్ల్ గా మారిపోయింది. క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సుధీర్ బాబు ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో తనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు కావడంతో పెర్ఫార్మన్స్ పరంగానూ మంచి స్కోప్ ఉంటుంది. రామ్ లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ది వారియర్’ కూడా భారీ అంచనాలతో తెరకెక్కుతున్నదే. ఇలా దూసుకుపోతోందీ అమ్మడు.

తాజాగా కోలీవుడ్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. బాలా దర్శకత్వంలో రూపొందబోయే మూవీ దాదాపు ఓకే అయినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చు. ఇటీవలే ఈటిలో తెలుగులో మరో డిజాస్టర్ అందుకున్న సూర్యకు తమిళ ఫలితం మరీ అంత దారుణంగా రాకపోవడం కొంత ఊరట కలిగించింది. అయితే ఇంకా బలమైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇలాంటి టైంలో బాలా లాంటి అవుట్ ఫోకస్డ్ డైరెక్టర్ తో చేయడం పట్ల అభిమానూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా శివపుత్రుడు లాంటి గొప్ప బ్రేక్ ఇచ్చిన దర్శకుడిగా బాలా కోసం సూర్య రిస్క్ తీసుకుంటున్నాడు.

ఇది కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయితే కృతి శెట్టికి వరసగా స్టార్ల సరసన అవకాశాలు వస్తాయి. ఇంకా తను టాప్ లీగ్ లోకి చేరలేదు. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో చేస్తేనే రేంజ్ పెరుగుతుంది. ఆ దిశగా సూర్య సినిమా ఒక ముందడుగు అనుకోవచ్చు. ఇవి కాకుండా నితిన్ తో మాచర్ల నియోజకవర్గం కూడా చేస్తున్న కృతికి రాబోయే ఆరు నెలల్లో మూడు రిలీజులు ఉంటాయి. ఆలోగా మరికొన్ని కమిట్మెంట్లు ఎలాగూ ఇస్తుంది. సో పూజా హెగ్డే, రష్మిక మందన్న తర్వాత ఆ రేంజ్ లో హవా నడిపించే ఛాన్స్ కృతికి గట్టిగానే ఉంది. కాకపోతే ఈ హిట్ల పరంపర ఇలాగే కంటిన్యూ అవ్వాలి. చూద్దాం

Also Read : Anushka , Samantha : సమంతానా అనుష్కనా – ఇద్దరిలో ఎవరు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet