iDreamPost
మంచి డ్రామాతో పాటు కమర్షియల్ స్కోప్ కు అవకాశం ఉన్న చరిత్రలోని ప్రముఖులను వెతికి మరీ బయటికి తీస్తున్నారు. అందులో ఒకరే బెంగళూరు నాగరత్నమ్మ. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు చాలా గ్యాప్ తర్వాత దీన్ని టేకప్ చేయాలని చూస్తున్నారు.
మంచి డ్రామాతో పాటు కమర్షియల్ స్కోప్ కు అవకాశం ఉన్న చరిత్రలోని ప్రముఖులను వెతికి మరీ బయటికి తీస్తున్నారు. అందులో ఒకరే బెంగళూరు నాగరత్నమ్మ. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు చాలా గ్యాప్ తర్వాత దీన్ని టేకప్ చేయాలని చూస్తున్నారు.
iDreamPost
ఇటీవలి కాలంలో స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్కులు బోరు కొడుతుండటంతో దర్శక నిర్మాతలు మెల్లగా ఇతర రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. అలియా భట్ గంగూబాయ్ కటియవాడి మంచి విజయం సాధించడంతో అలాంటి బయటి ప్రపంచానికి తెలియని కథలను చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మంచి డ్రామాతో పాటు కమర్షియల్ స్కోప్ కు అవకాశం ఉన్న చరిత్రలోని ప్రముఖులను వెతికి మరీ బయటికి తీస్తున్నారు. అందులో ఒకరే బెంగళూరు నాగరత్నమ్మ. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు చాలా గ్యాప్ తర్వాత దీన్ని టేకప్ చేయాలని చూస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాతో ఓ వెర్షన్ రాయించేసి రెడీగా ఉంచారట.
ఇదో దేవదాసి సబ్జెక్టు. అయినా కూడా బోలెడంత మలుపులు ఆవిడ జీవితంలో ఉన్నాయి. కర్ణాటక నలుమూలల ఈవిడ గురించి తెలిసిన వారు ఉన్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ లో ఈజీగా వర్క్ అవుట్ అయ్యే కాన్సెప్ట్. అందుకే ముందుగా సమంతా దగ్గర ఈ ప్రతిపాదన తీసుకెళ్లారట. తను ఏదీ తేల్చకపోవడంతో నెక్స్ట్ ఛాయస్ గా అనుష్క వద్దకు వెళ్ళింది. వెంటనే నో చెప్పలేదు కానీ కొంచెం టైం తీసుకుని అలోచించి చెబుతానని అన్నట్టు సమాచారం. అనుష్క నిశ్శబ్దం తర్వాత కనిపించలేదు. అంతకు ముందు భాగమతినే. వాటి మధ్య కూడా గ్యాప్ ఉంది. ఆఫర్లు వస్తున్నా కూడా స్వీటీ ఎందుకో తెరముందుకు వచ్చేందుకు సుముఖంగా లేదు.
మరి నాగరత్నమ్మగా ఎవరు వస్తారో చూడాలి. నిర్మాత ఎవరో ఇంకా క్లారిటీ లేదు. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ రూపొందించిన సింగీతం శ్రీనివాసరావు గారు వయసు దృష్ట్యా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. మరి ఇన్నేళ్ల తర్వాత మునుపటిలా నాగరత్నమ్మను తీయగలరా అనేది మొదలయ్యాక కానీ చెప్పలేం. లేదా కేవలం పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే తీసుకుని వేరొకరికి డైరెక్షన్ ఇస్తారా అనేది వేచి చూడాలి. అనుష్క మంచి ఛాయస్ కానీ ఒకవేళ తను కూడా కాదంటే ఇంకెవరిని చూస్తారో మరి. ఐదేళ్లకే దేవదాసిగా మారి ఆపై గొప్ప గాయనిగా ఎదిగిన నాగరత్నమ్మ లాంటి కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Also Read : Baahubali : బ్లాక్ బస్టర్ మూడో భాగం గురించి రాజమౌళి