iDreamPost
android-app
ios-app

Allu Arjun & SS Rajamouli : ఐకాన్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్

  • Published Mar 16, 2022 | 2:25 PM Updated Updated Dec 12, 2023 | 6:23 PM

Allu Arjun , SS RajamoulI.

Allu Arjun , SS RajamoulI.

  • Published Mar 16, 2022 | 2:25 PMUpdated Dec 12, 2023 | 6:23 PM
Allu Arjun & SS Rajamouli : ఐకాన్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందోనని ఎదురు చూస్తున్న దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట, త్రివిక్రమ్ తో ప్రాజెక్టు కాగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ కాంబినేషన్ మీదున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉండబోతున్నట్టు ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. మెల్లగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కేవలం ప్రకటనకే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగించిన ఈ కాంబో రేపు తెర మీదకు వచ్చాక ఏ స్థాయిలో అరాచకం చేస్తుందో వేరే చెప్పాలా. కాకపోతే 2024 దాకా విడుదలను ఆశించడం కష్టం.

ఇదిలా ఉండగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జక్కన్న కలయికలో సినిమా రావొచ్చనే వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్ తో పాటు ఫిలిం నగర్ లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రాజమౌళి తండ్రి కథకులు విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కానీ దీని ప్రస్తావన జక్కన్న ఎక్కడా తేలేదు. ఒకటి అయ్యాకే మరొకటి సూత్రం పాటిస్తున్న ఈ ఇండియన్ స్పిల్ బర్గ్ అంత ఈజీగా ఈ విషయాన్ని ఒప్పుకోవడం ఖండించడం జరగదు. ఎప్పటి నుంచో ఈ జంట కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండు మూడేసి సినిమాలు చేసిన జక్కన్న బన్నీతో చేయడం ఫ్యాన్స్ కల.

పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కోసం అల్లు అర్జున్ పక్కా ప్రణాళికతో వెళ్తున్నాడు. ఆలస్యమైనా పర్లేదు కంటెంట్ ముఖ్యమనే రీతిలో కొత్త సినిమా ఏదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. మొన్న సంజయ్ లీలా భన్సాలీని కలవడం గురించి పలురకాల ఊహాగానాలు చెలరేగినప్పటికీ అదంతా ఫార్మల్ మీటింగ్ అనే క్లారిటీ వచ్చేసింది. ఇక పుష్ప 2 మొదలుపెట్టేందుకు వెయిట్ చేస్తున్న బన్నీ అవతల సుకుమార్ వెకేషన్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. రాగానే అయిదు నెలల్లో పూర్తి చేయగలిగితేనే డిసెంబర్ రిలీజ్ సాధ్యమవుతుంది. లేదా మళ్ళీ 2023 ఫస్ట్ హాఫ్ లో ప్లాన్ చేసుకోవాలి. చూద్దాం

Also Read : RRR Pre Release Event : అక్కడ సరే ఇక్కడ ఈవెంట్ మాటేమిటి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet