iDreamPost
android-app
ios-app

Alia Bhatt : మహేష్ తారక్ ఇద్దరి సరసన ఆఫర్లా

  • Published Mar 07, 2022 | 6:30 PM Updated Updated Mar 07, 2022 | 6:30 PM
Alia Bhatt : మహేష్ తారక్ ఇద్దరి సరసన ఆఫర్లా

ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదల కాలేదు కానీ అలియా భట్ అప్పుడే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోతోంది. నిజానికి ఆ సినిమాలో తను చేసింది గ్లామర్ పాత్ర కాదు. కనీసం డ్యూయెట్ కూడా ఉండదు. పైపెచ్చు త్యాగపూరితమైన టచ్ కూడా ఉంటుంది. అలాంటిది ఉన్నట్టుండి ఈ డిమాండ్ ఎందుకొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. దానికి సమాధానం ఉంది. అలియా తెలుగు సినిమాలు మాత్రమే చూసే వాళ్లకు పరిచయం తక్కువ కానీ రెగ్యులర్ గా హిందీ మూవీస్ ఫాలో అయ్యేవాళ్ళకు తనెంత గొప్ప ఆర్టిస్టో బాగా తెలుసు. ఇటీవలే వచ్చిన గంగూబాయ్ కటియావాడిలో తన పెర్ఫార్మన్స్ చూసినవాళ్ళు ఎవరైనా ఈ సత్యం ఒప్పుకుంటారు.

అందుకే ట్రిపులార్ రిలీజ్ కు ముందే తమ ప్రాజెక్టులలో ఆమెను లాక్ చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రానికి ఆల్రెడీ తను ఓకే చెప్పిందనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది. తాజాగా మహేష్ బాబు రాజమౌళి కలయికలో తీయబోయే సినిమాకు కూడా అలియానే అడిగారని లేటెస్ట్ అప్ డేట్. ఇంత మంచి ఆఫర్ తనైనా ఎందుకు కాదంటుంది. కాకపోతే ఈ ఇద్దరి సినిమాల్లో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యం క్యారెక్టర్ వెయిటేజ్ ఉండవు. మరి అలియా భట్ అయినా పర్లేదు అని ఒప్పుకుందా లేక స్పెషల్ గా ఆ పాత్రలు డిజైన్ చేస్తారేమో చూడాలి.

పైన చెప్పిన రెండు సినిమాలు ఇంకా అఫీషియల్ గా ఓకే కాలేదు. కాకపోతే ప్రాధమికంగా చర్చలు జరిగాయని తెలిసింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న తారక్ అది కాగానే ప్రమోషన్లు పూర్తి చేసుకుని ఆపై కొరటాలతో రెగ్యులర్ షూట్ కు వెళ్తాడు. ఈలోగా అలియా కనక ఓకే చెబితే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాటను వచ్చే నెలలోగా ఫినిష్ చేసి త్రివిక్రమ్ తో కలిసి సెట్ లో అడుగు పెడతాడు. అదయ్యాక జక్కన్నతో షురూ. దీనికీ అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఎక్కువ రోజులు హైదరాబాద్ లో మకాం పెట్టేయొచ్చు. లేట్ అయినా సరే టాలీవుడ్ క్రేజీ హీరోస్ తోనే తనకు ఆఫర్లు రావడం విశేషం.

Also Read : Akhil Akkineni : నాన్న రూట్లోనే వారసుడు కూడా

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin