iDreamPost

వీడియో: గూస్ బంప్స్ తెప్పిస్తున్న అయోధ్య బాలరాముడి చిరునవ్వులు! AI మహిమ!

బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. శ్రీరామ్ లల్లా అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో జనవరి 22 నుండి పూజలు అందుకుంటున్నాడు. శ్రీరాముడిని కన్నులారా తిలకించేందుకు భక్తులు తరలి వెళుతున్నారు. ఈ సమయంలో..

బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. శ్రీరామ్ లల్లా అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో జనవరి 22 నుండి పూజలు అందుకుంటున్నాడు. శ్రీరాముడిని కన్నులారా తిలకించేందుకు భక్తులు తరలి వెళుతున్నారు. ఈ సమయంలో..

వీడియో: గూస్ బంప్స్ తెప్పిస్తున్న అయోధ్య బాలరాముడి చిరునవ్వులు! AI మహిమ!

’జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే‘ అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయారు దేశంలోని హిందూ భక్తులు. ఏళ్ల నాటి కల తీరిందన్న ఆనందంలో ఉన్నారు. అయోధ్యలో తన జన్మభూమిలో తిరిగి కొలువు దీరారు రాములోరు. రఘుకుల నందనుడు తిరిగి రావడంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. అయోధ్యలో నిర్మించిన రామాలయంలో జనవరి 22న బాల రాముని ప్రతిష్టాపన అంగరంగ వైభంగా జరిగిన సంగతి విదితమే. యావత్ భారతావని ఈ సుందరమైన దృశ్యాన్ని టీవీ, ఎల్ఈడీ స్క్రీన్లలో తిలకించి తరించారు. జై శ్రీరామ స్మరణతో ఆధ్మాత్మిక చింతనలో మునిగి తేలారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుక జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో శ్రీరామ్ లల్లాకు పట్టు పీతాంబరాలు, ఛత్రాన్ని మోడీ తీసుకెళ్లగా.. సంకల్ప పూజతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు వేద పండితులు. అనంతరం బాలరాముని ప్రాణ ప్రతిష్ట వేడుక జరిగింది. 130 కోట్ల ప్రజల మందికి ఈ నీల మేఘ శ్యాముని నిజ దర్శనం కనిపించింది. నిండైన రూపం, నగుమోముతో ఆయన రూపం కనిపించగానే పులకరించిపోయారు హిందూ భక్తులు. త్రేతా యుగం నాటి ఆ చిన్ని రాముడి నిలువెత్తు రూపం చూసి తరించిపోయారు. చిద్విలాసంతో కూడిన 51 అడుగుల విగ్రహాన్ని చూసి మైమరిచిపోయారు. ఒక చేతిలో బాణం, మరో చేతితో విల్లు ఉన్న ఈ విగ్రహం చూస్తే ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.

అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి.. ఈ రాముడికి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అందులో బాల రాముడు కళ్లు తెరిచి, చిర నవ్వులు చిందిస్తూ..భక్తులను వీక్షిస్తున్నట్లుగా, తల అటు ఇటు తిప్పుతూ పలకరిస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. ఈ వీడియోను చూస్తుంటే.. గుస్ బంప్స్ రావడం పక్కా. ఈ వీడియోను ఇప్పటికే అనేక మంది వీక్షించారు. అలాగే నగుమోము, చిద్విలాసాన్ని చూసి మురిసిపోతున్నారు. చాలా మంది ఈ వీడియోను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఏఐ మాయాజాలంతో మంత్ర ముగ్దులను చేసేస్తోంది ఈ వీడియో. ఇప్పటికే ఒక మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరీ ఈ వీడియో ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి