iDreamPost

సైలెంట్ గా OTTలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 22, 2024 | 10:33 AMUpdated Mar 22, 2024 | 2:13 PM

దేశభక్తి నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి రిలీజ్ కానుందని వార్త జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఎటువంటి ప్రచారము లేకుండా సడన్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

దేశభక్తి నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి రిలీజ్ కానుందని వార్త జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఎటువంటి ప్రచారము లేకుండా సడన్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Mar 22, 2024 | 10:33 AMUpdated Mar 22, 2024 | 2:13 PM
సైలెంట్ గా  OTTలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటేస్ట్ గా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను దేశభక్తి నేపథ్యంలో దర్శకుడు ప్రతాప్ సింగ్ హడ ఈనెల మార్చి 1న థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా వరుణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. అలాగే ఈ మూవీకు సంబంధించిను ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. అందరూ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, విజువ‌ల్స్ బాగున్నా.. క‌థ‌ మాత్రం అడియాన్స్ ను మెప్పించడంలో విఫలమైందనే చెప్పాలి. దీంతో ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక కలెక్షన్స్ కూడా అంతంతా మాత్రమే ఉండటంతో.. ఈ సినిమా రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుందనే వార్త జోరుగా వినిపించింది. అయితే సడన్ గా ఈ సినిమా ఎటువంటి ప్రకటన లేకుండా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకి ఎక్కడంటే..

హీరో వరుణ్ తేజ్ ఇటీవలే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను ఈనెల అనగా మార్చి 1న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించగా.. ఇందులో హీరోయిన్ గా మానుషి చిల్లర్ నటించింది. అయితే చాలా కాలం తర్వాత సరికొత్త కథాంశంతో అడియన్స్ ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ సినిమా..కథ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక మొత్తానికి థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ఆపరేషన్ వాలంటైన్‌ ను త్వరలో ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది. అలాగే ఈ సనిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ సైలాంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండా.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో నేటి (శుక్రవారం మార్చి 22) నుంచి అందుబాటులోకి వచ్చేసింది. కానీ, ఈ సినిమా అనేది రెంటల్ విధానంలో రిలీజ్ చేశారు. దీంతో ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 279 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది.

Varun tej operation valintine in OTT

అయితే పుల్వామా ఎటాక్‌తో పాటు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ బ్యాక్‌డ్రాప్‌లో య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెరెక్కెక్కించిన ఈ సినిమా.. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైంది. కానీ, ఈ సినిమా కేవలం ఐదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకోవడంతో..నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో ఈనెల మార్చి 1న థియేట‌ర్ల‌లో విడుదలైన ఈ సినిమా కేవలం 22 రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేయడం అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక అపరేషన్ వాలెంటైన్ సినిమా కథ విషయానికొస్తే.. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడ‌ర్‌గా అర్జున్ రుద్ర దేవ్ (వ‌రుణ్ తేజ్‌)ప‌నిచేస్తుంటాడు . ఇక ఇతనికి ధైర్యం, దూకుడు ఎక్కువ‌. ఈ క్రమంలోనే.. దేశ‌కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానికైన సిద్ధ‌ప‌డ‌తాడు. ఇక ఆప‌రేష‌న్ వ‌జ్ర కోసం అర్జున్ చేసిన సాహ‌సం కార‌ణంగా అత‌డి స్నేహితుడు క‌బీర్ ప్రాణాల‌ను కోల్పోతాడు. అయితే అది అర్జున్ కెరీర్ కు మ‌చ్చ‌గా మిగిలిపోతుంది. దీంతో క‌శ్మీర్‌లో పుల్వ‌మాలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిపై ప్ర‌తీకారం తీర్చుకునే బాధ్య‌త‌ను ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అర్జున్‌కు అప్ప‌గిస్తుంది? అప్పుడు అర్జున్ ఉగ్ర‌వాదుల‌ను ఎలా అంతం చేస్తాడు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లో ఎలాంటి సాహ‌సాలు చేశాడు. ? ఈ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత ఇండియాను దెబ్బ‌కొట్టేందుకు పాక్ ఎలాంటి ఎత్తులు వేసింది? అస‌లు అప‌రేష‌న్ వాలెంటైన్ అంటే ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. మరి, ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న వరుణ్ తేజ్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి