iDreamPost

ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్-లావణ్యాల ఫస్ట్ ఫోటో.. నెట్టింట వైరల్..!

  • Published Jun 14, 2023 | 11:34 AMUpdated Jun 14, 2023 | 11:34 AM
  • Published Jun 14, 2023 | 11:34 AMUpdated Jun 14, 2023 | 11:34 AM
ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్-లావణ్యాల ఫస్ట్ ఫోటో.. నెట్టింట వైరల్..!

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల సభ్యుల మధ్య చాల సింపుల్ గా ఈ వేడుక జరిగింది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది. ఇక వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోనున్నారు. నిశ్చితార్థం తర్వాత ఇద్దరు విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ తర్వాత షేర్ చేసిన ఫస్ట్ ఫోటో కావడంతో ఇది నిమిషాల్లో వైరల్ అయ్యింది. ఈ ఫోటోతో పాటు తమ ఎంగేజ్‌మెంట్‌కు విషెస్‌ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

వరుణ్‌, లావణ్య ఒకే ఫొటోను, ఒకే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. అందులో లావణ్య.. వరుణ్‌ తేజ్‌ చేయి పట్టుకుని నడుస్తూ.. చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు జంటగా కలిసి ఉన్న ఫస్ట్ ఫోటో కావడంతో ఇది నిమిషాల్లో వైరల్ అయ్యింది. ఇరువురి అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారుషేర్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే ఆ ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి.

ఇక వీరిద్దరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. 2017లో విడుదలైన ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌- లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఆ తర్వాత ఏడాదిలోనే వీరిడ్డారు జంటగా ‘అంతరిక్షం’ సినిమాలో నటించారు. ఈ క్రమంలో వారి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమా పూర్తైన తర్వాత వరుణ్‌.. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు, లావణ్య ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అధర్వ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఇదే కాకా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఓ సినిమాలో, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి