iDreamPost

డ్రగ్స్ కేసు వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మి శరత్​కుమార్!

  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
డ్రగ్స్ కేసు వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మి శరత్​కుమార్!

వరలక్ష్మి శరత్ కుమార్.. టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే మంచి పాపులారిటీ సంపాదించిన నటి. మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేష్ ‘నాంది’, నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు వరలక్ష్మి. ముఖ్యంగా ‘క్రాక్​’లో ఆమె నటనకు తెలుగు ఆడియెన్స్​ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. వరుస చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. వరలక్ష్మీతో పాటు అవికాగోర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ వెబ్​ సిరీస్ ‘మాన్షన్ 24’. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రమోషన్స్​లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లో నిర్వహించారు.

‘మాన్షన్ 24’ ప్రమోషన్స్​లో పాల్గొన్న వరలక్ష్మి శరత్​కుమార్ డ్రగ్స్ కేసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు నోటీసులు అందాయంటూ వచ్చిన న్యూస్​లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు వరలక్ష్మి. తనకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్ కాల్స్ కానీ రాలేదని క్లారిటీ ఇచ్చారు. ఆదిలింగం అనే వ్యక్తి గతంలో తన దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్​గా వర్క్ చేశాడన్నారు. దళపతి విజయ్ ‘సర్కార్’తో పాటు ఆయన తీసుకొచ్చిన మూడ్నాలుగు మూవీస్​లో తాను యాక్ట్ చేశానన్నారు వరలక్ష్మి.

డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు. గతంలో నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్​గా పనిచేసిన ఆదిలింగం తీసుకొచ్చిన మూడ్నాలు సినిమాలు నేను చేశా. అంతేతప్ప ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకేమీ తెలియదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆదిలింగం పేరుతో వార్తలు వచ్చాయి. దీనికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నా ఫొటోను వాడి ‘వరలక్ష్మి మేనేజర్​కు నోటీసులు’ అని న్యూస్ వేస్తున్నారు. అంతేగానీ ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి శరత్​కుమార్ చెప్పుకొచ్చారు. తాను పదేళ్లలో 50 సినిమాలు చేశానని.. ఇదంత ఈజీ కాదన్నారామె. చాలా కష్టపడి ఇక్కడి దాకా వచ్చానని.. తనను ఇంతగా ప్రోత్సహిస్తున్న తెలుగు ఆడియెన్స్​కు వరలక్ష్మి థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడి వాళ్లు తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని.. అందుకే హైదరాబాద్​కు షిఫ్ట్ అయ్యానని వరలక్ష్మి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకు గాయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి