iDreamPost

రాధాను బాగానే వాడుతున్నారుగా !!!

రాధాను బాగానే వాడుతున్నారుగా !!!

అమరావతి
ఉద్యమంలో రాధా మరో సమిధ..

గత
పది పదిహేనేళ్ల రాజకీయాలను
గమనిస్తే వంగవీటి రాధాకృష్ణ
కన్నా దురదృష్టవంతుడు లేరని
చెప్పవచ్చు. అప్పుడెప్పుడో
వైఎస్సార్ జమానాలో ఒకసారి
ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ
ఆ తరువాత గెలుపు ముఖం చూడలేదు
. తండ్రి
వంగవీటి మోహన రంగా వారసత్వాన్ని
నిలబెట్టే అవకాశం వచ్చినా
నిలుపుకోలేకపోయారు.
2019 ఎన్నికల్లో
మచిలీపట్నం ఎంపీ గాని,
ఎమ్మెల్యేగాని
ఇస్తానన్న వైఎస్ జగన్ హామీని
కాలదన్ని టిడిపిలో చేరి,
అటు అక్కడా
టికెట్ దక్కక అభాసుపాలయ్యారు.వైఎస్సార్
కాంగ్రెస్ లో ఉంటే
గెలచేెవారేమో..లేకున్నా
ఆయనకు ప్రాధాన్యం మాత్రం
దక్కేది.


విషయం అలా ఉంచితే ఇప్పుడు
ఆయన చంద్రబాబుకు బాగా యూజ్
అవుతున్నారు ..అంతకన్నా
ఆయన్ను చంద్రబాబు బాగా
వాడుతున్నారని చెప్పవచ్చ్.
అయితే
ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా
కాపు ఓట్ బ్యాంక్ ను చీల్చి
టిడిపికి ఉపయోగపడతాడని
భావించిన రాధా ఎక్కడా తన
ప్రభావం చూపలేకపోయాడు.
అటు టిడిపి
కూడా చిత్తుగా ఓడిపోవడంతో
ఆయన మళ్ళీ రాజకీయ నిరుద్యోగి
గా మిగిలిపోయాడు. అయితే
ఇప్పుడు ఆయన్ను చంద్రబాబు
మళ్ళీ వాడకానికి పెట్టారు.
అమరావతి
నుంచి రాజధాని తరలింపును
నిరసిస్తూ కొన్ని రోజులుగా
అక్కడ కొందరు రైతులు ఆందోళనలు
చేస్తున్నారు.

అయితే
ఈ ఉద్యమంలో కేవలం ఒకే కులానికి
చెందినవారు పాల్గొంటున్నారని,
అమరావతి
అన్నది కేవలం ఒకే కులానికి
చెందినది కాబట్టే వాళ్ళు
మాత్రమే అతిగా స్పందిస్తున్నారు
తప్ప మిగతా జనాల్లో ఆ ఫీలింగ్
అసలు లేదన్న భావన ప్రజల్లోకి
వెళ్ళింది. దీంతో
ఈ ట్యాగ్ ను వదిలించుకునేందుకు
, ఇంకా
ఈ ఉద్యమం అందరిదీను అని
చెప్పేందుకు చంద్రబాబు
కాపు
నాయకుడిగా చెబుతున్న రాధాకృష్ణకు
అమరావతి ఉద్యమంలో భాగంగా
చేస్తున్నారు. మందడం,
తుళ్లూరు
తదితర గ్రామాల్లో రాధాకృష్ణ
పర్యటించడంతో బాటు వైఎస్
జగన్ మోహన్ రెడ్డిమీద,
ప్రభుత్వ
నిర్ణయాల మీద తీవ్ర విమర్శలు
చేయడం రాధాకృష్ణ పని అన్నమాట.
ఈ మేరకు
రాధాకృష్ణ కూడా రైతుల పేరిట
అమరావతిలో జరుగుతున్న ఉద్యమంలో
పాల్గొనడం
ప్రభుత్వం
మీద విమర్శలు చేయడం,
అమరావతి
రాష్ట్ర ప్రజల భావోద్వేగంతో
కూడిన వ్యవహారం అన్నట్లుగా
మాట్లాడుతున్నారు.

అందులో
భాగంగా శనివారం

ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌పై టీడీపీ నేత
వంగవీటి రాధ తీవ్ర విమర్శలు
చేశారు. జగన్
లాంటి సీఎం దేశంలో ఎక్కడా
ఉండరని వ్యాఖ్యానించారు.
శనివారం
మందడంలో పర్యటించిన వంగవీటి
రాధా అక్కడ రైతులు చేపట్టిన
దీక్షకు సంఘీభావం తెలిపారు.
53 రోజులుగా
మహిళలు రోడ్డెక్కినా ప్రభుత్వంలో
ఇసుమంతైనా చలనం లేదని,
ప్రభుత్వం
మూర్ఖంగా ముందుకెళ్తోందని
విమర్శించారు. మంత్రి
బొత్స సత్యనారాయణ, సజ్జల
రామకృష్ణ, అజేయ
కల్లం ఇష్టం వచ్చినట్లు
మాట్లాడుతున్నారని,
వారంతా
ఎప్పుడైనా వ్యవసాయం చేశారా?
అని వంగవీటి
రాధా ఫైర్ అయ్యారు. 29
గ్రామాల్లోనే
ఉద్యమం ఉందని అసత్యాలు ప్రచారం
చేస్తున్నారని ధ్వజమెత్తారు.
“” ఇలాంటి
ప్రసంగాల ద్వారా రాధాకృష్ణ
తాను ఇంకా రాజకీయాల్లో ఉన్నానని
తన ఉనికిని చాటుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి