iDreamPost
android-app
ios-app

Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. ముద్దులు పెట్టుకున్న స్టార్ క్రికెటర్స్!

  • Published Feb 14, 2024 | 5:08 PM Updated Updated Feb 14, 2024 | 5:08 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు అందరూ వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా ఈ రోజును తమ స్టైల్​లో జరుపుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు అందరూ వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా ఈ రోజును తమ స్టైల్​లో జరుపుకున్నారు.

  • Published Feb 14, 2024 | 5:08 PMUpdated Feb 14, 2024 | 5:08 PM
Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. ముద్దులు పెట్టుకున్న స్టార్ క్రికెటర్స్!

నేడు లవర్స్ ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలెంటెన్స్ డే. ఇవాళ అందరూ తాము ప్రేమించే వారిని స్పెషల్​గా కలుసుకోవాలని, వారికి గిఫ్ట్​లు ఇవ్వాలని, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలని అనుకుంటారు. అందుకే రిసార్ట్స్, హోటల్స్, పార్కులు ఇలా ఎక్కడ చూసినా ప్రేమ జంటలే దర్శనమిస్తున్నాయి. సాధారణ ప్రజలతో పాటు క్రికెటర్లు, సినిమా తారలు, అలాగే ఇతర సెలబ్రిటీలు కూడా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన వారికి మనసులోని మాటను చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు. జీవితాంతం తమకు తోడుగా ఉండాలని.. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమంటూ లవ్ ఎక్స్​ప్రెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా వాలెంటైన్స్ డేను కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ముద్దులు కూడా పెట్టుకున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడం జంపా, ఆల్​రౌండర్ మార్కస్ స్టొయినిస్ కిస్ చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్​బాష్ లీగ్​లో మెల్​బోర్న్ స్టార్స్ జట్టుకు వీళ్లిద్దరూ కలసి ఆడుతున్నారు. కంగారూ టీమ్​ తరఫున కూడా చాలా ఏళ్లుగా కలసి బరిలోకి దిగుతున్నారు స్టొయినిస్-జంపా. ఈ నేపథ్యంలో బీబీఎల్​కు సంబంధించిన ఫొటో షూట్​లో వాళ్లిద్దరూ కలసి ఓ ఫొటో దిగారు. ఇందులో స్టొయినిస్ బుగ్గలపై జంపా ముద్దు పెట్టారు. వాలెంటైన్స్ డే కావడంతో ఆ ఫొటోలను కొందరు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీటిని చూసిన నెటిజన్స్ మేల్ క్రికెటర్స్ ఇలా ముద్దులు పెట్టుకోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. చాన్నాళ్లుగా కలసి క్రికెట్ ఆడుతున్న జంపా-స్టొయినిస్ మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది.

గ్రౌండ్​తో పాటు డ్రెస్సింగ్ రూమ్​లోనూ జంపా-స్టొయినిస్ ఒకే చోట కనిపించడం, ఒకర్నొకరు హగ్​ చేసుకోవడం, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, అసభ్యంగా టచ్ చేసుకోవడం లాంటి ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరూ గేలు అని బిగ్ డిస్కషన్స్ కూడా నడిచాయి. అలాంటిదేదీ లేదని సహచర క్రికెటర్లు ఖండించినా ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ వాళ్లిద్దర్నీ గేలుగా చిత్రీకరించారు. అయితే మూడేళ్ల కింద హ్యారియట్ పామర్ అనే మహిళను జంపా పెళ్లి చేసుకోవడంతో ఈ రూమర్స్​కు బ్రేక్ పడింది. జంపా-పామర్ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాయి. ఒకవైపు ఈ స్పిన్నర్ పర్సనల్ లైఫ్​లో భార్య, పిల్లాడితో సంతోషంగా ఉండగా.. మరోవైపు స్టొయినిస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ తరుణంలో వాలెంటైన్స్​ డే నాడు మరోమారు ఇద్దరు క్రికెటర్లు ముద్దులు పెట్టుకున్న ఫొటోలు వైరల్ అవడం చర్చనీయాంశంగా మారింది. మరి.. జంపా-స్టొయినిస్ ఫొటోలు వైరల్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ అది తగ్గించుకో.. సలహా ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్!

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom