iDreamPost

IND vs ENG: రోహిత్ శర్మ అది తగ్గించుకో.. సలహా ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇటు ఆటగాడిగా, అటు కెప్టెన్ గా విఫలం అవుతూ వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ బౌలర్ అది తగ్గించుకోవాలంటూ ఓ సలహా ఇచ్చాడు. మరి ఆ సలహా ఏంటో చూద్దాం.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇటు ఆటగాడిగా, అటు కెప్టెన్ గా విఫలం అవుతూ వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ బౌలర్ అది తగ్గించుకోవాలంటూ ఓ సలహా ఇచ్చాడు. మరి ఆ సలహా ఏంటో చూద్దాం.

IND vs ENG: రోహిత్ శర్మ అది తగ్గించుకో.. సలహా ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్!

రోహిత్ శర్మ.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. కానీ ఆ ఫామ్ ను మాత్రం ఆ తర్వాత కొనసాగించలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి ఆఫ్గాన్ తో జరిగిన టీ20 సిరీస్ వరకు దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇటు ఆటగాడిగా, అటు కెప్టెన్ గా విఫలం అవుతూ వస్తున్నాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ రోహిత్ కు ఓ సలహా ఇచ్చాడు. రోహిత్ ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం ఒక ఆటగాడిగా, కెప్టెన్ గా అతడికి నష్టమే కలిగిస్తుందని హెచ్చరించాడు.

సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో సైతం తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ముగిసిన రెండు టెస్టుల్లో 24, 39, 14, 13 స్కోర్లతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రోహిత్ ఆటతీరుపై విమర్శలు రావడం మెుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ రోహిత్ కు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు, అతడు అవలంబిస్తున్న ధోరణి చిత్రంగా అనిపిస్తోందని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.

తాజాగా క్రిక్ బజ్ తో భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. అతడు అతిగా ఆలోచించడమే కాకుండా.. అతి జాగ్రత్తగా ఆడాలని అనుకుంటున్నాడు. ఇది జట్టుకు, అతడికి నష్టమే కలిగిస్తుంది. మెుదట్లోనే భారీ స్కోర్లు చేయాలని రోహిత్ భావిస్తున్నాడు. కానీ ఇదే టైమ్ లో ఓ విషయాన్ని మర్చిపోతున్నాడు. టీమ్ లో కీలక ప్లేయర్లు లేనప్పుడు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కనీసం రెండు లేదా మూడు భాగస్వామ్యాలు వస్తేనే జట్టు భారీ స్కోర్ సాధిస్తుంది. స్వేచ్ఛగా ఆడటమే రోహిత్ కు తెలుసు. కానీ ఇప్పుడు అది మిస్ అవుతోంది. అతిగా ఆలోచించడం, అతి జాగ్రత్త మంచిది కాదు. దాన్ని తగ్గించుకోవాలి” అంటూ రోహిత్ కు సూచనలు చేశాడు ఈ మాజీ బౌలర్. మరి హిట్ మ్యాన్ కు ఆర్పీ సింగ్ సలహాలు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MS Dhoni: కృతజ్ఞత చూపేందుకు కోట్లు వదులుకున్నాడు! ఇది సార్‌ ధోని అంటే: కోహ్లీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి