iDreamPost
android-app
ios-app

ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లిన 23 ఏళ్ల యువతిపై దారుణం..!

ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లిన 23 ఏళ్ల యువతిపై దారుణం..!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు నిష్ఠా త్రిపాఠి. ప్రస్తుతం యూపీలోని ఓ ప్రముఖ కాలేజీలో బీకామ్ చదువుతోంది. అయితే ఫ్రెండ్స్ తో కలిసి బుధవారం కాలేజీలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొంది. ఇక అదే రోజు రాత్రి తన తోటి స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. కాగా, అదే పార్టీలో నిష్ఠా త్రిపాఠియువతిపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో తోటి స్నేహితులు, ఆ యువతి తల్లిదండ్రులు షాక్ గురవయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని బీబీడీ యూనివర్సిటీలో నిష్ఠా త్రిపాఠి (23) అనే యువతి బీకామ్ చదువుతోంది. అయితే బుధవారం తన తోటి క్లాస్ మెట్స్ తో కలిసి కాలేజీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొంది. అక్కడ ఆ యువతి ఎంతో సంతోషంగా ఆడిపాడింది. ఈ కార్యక్రమ అనంతరం స్నేహితులతో కలిసి దయాళ్ రెసిడెన్సీ ప్రాంతంలోని ఓ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీలో కొందరు యువకులు తుపాకీతో హల్చల్ చేశారు. ఇంతే కాకుండా అదే గన్ తో కాల్పులు జరపడంతో నిష్ఠా త్రిపాఠి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనతో ఆమె తోటి స్నేహితులు షాక్ గురయ్యారు. చేసేదేంలేక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet