iDreamPost
android-app
ios-app

లంకపై ఓటమి! పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఎమోషనల్‌ లెటర్‌

  • Published Sep 15, 2023 | 5:24 PM Updated Updated Sep 15, 2023 | 5:24 PM
  • Published Sep 15, 2023 | 5:24 PMUpdated Sep 15, 2023 | 5:24 PM
లంకపై ఓటమి! పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఎమోషనల్‌ లెటర్‌

ఆసియా కప్‌ 2023లో భాగంగా సూపర్‌ 4లో శ్రీలంకతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ ఓటమితో వాళ్లు ఆసియా కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఫైనల్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతులెత్తేసింది. పైగా శ్రీలంకపై గెలిస్తే.. ఇండియాపై ఫైనల్‌ ఆడే ఛాన్స్‌ ఉండేది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు సైతం ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తారు.

కానీ, పాకిస్థాన్‌ లంకపై ఓడిపోవడంతో.. ఇండియా-పాకిస్థాన్‌ ఫైనల్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇది పాకిస్థాన్‌ అభిమానులను విపరీతంగా బాధించింది. క్రికెట్‌ను మతంలా భావించే దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఒకటి. అలాంటి దేశం కాబట్టే.. పాక్‌ టీమ్‌ గెలిస్తే ఎంతలా సంబురపడిపోతారో.. ఓడితే అదే స్థాయిలో క్రికెటర్లను తిట్టిపోస్తారు. ఇప్పుడు పాక్‌ క్రికెటర్లు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. లంకపై ఓడి.. ఆసియా కప్‌ను నిష్క్రమించడంతో పాకిస్థాన్‌ అభిమానులు.. పాక్‌ క్రికెటర్లపై తిట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఒసామా మీర్‌ స్పందిస్తూ.. కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.

బాగా ఆడినప్పుడే కాకుండా.. బాగా ఆడకపోయినా తమకు మద్దతుగా నిలవాలని.. నిజానికి బ్యాడ్‌ టైమ్‌లోనే అభిమానుల మద్దుతు క్రికెటర్లకు చాలా అవసరం ఉంటుందని అన్నాడు. గెలిచినప్పుడు మెచ్చకుని, ఓడినప్పుడు తమను చెత్త క్రికెటర్లుగా పేర్కొనడంలో అర్థం లేదని అన్నారు. షాదాబ్‌ ఖాన్‌ బాగా ఆడుతున్నప్పుడు గొప్ప క్రికెటర్‌ అని కీర్తించి.. ఆసియా కప్‌లో బాగా ఆడనంత మాత్రనా.. అసలు అతన్ని టీమ్‌లో ఎందుకు ఉంచారు అంటే ఎలా అని ప్రశ్నించాడు. తాను పాక్‌ తరఫున అరంగేట్రం చేసిన కొత్తలో విపరీతంగా హైప్‌ ఇచ్చిన అభిమానులే ఇప్పుడు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలైమనా.. పాకిస్థాన్‌ టీమ్‌ తిరిగి బలంగా పుంజుకుంటుదని ధీమా వ్యక్తం చేశాడు. మరి ఒసామా మీర్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌: టీమిండియాతో ఫైనల్‌! శ్రీలంకకు భారీ షాక్‌