iDreamPost

మీ ఒంట్లోనే కాదు.. ఇంట్లో సమస్యలకి కూడా నిమ్మకాయలతో ఇలా చెక్ పెట్టొచ్చు..

మీ ఒంట్లోనే కాదు.. ఇంట్లో సమస్యలకి కూడా నిమ్మకాయలతో ఇలా చెక్ పెట్టొచ్చు..

సాధారణంగా మన ఇంటిని శుభ్రం చేయడానికి, వంటలలో వాడడానికి నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ రసం ను వేడి నీటిలో కలుపుకొని తాగుతారు మరియు నిమ్మరసంలో చెక్కర లేదా ఉప్పు, తేనె కూడా కలుపుకొని తాగుతారు. నిమ్మకాయతో పచ్చడి, పులిహార ఇంకా రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజూ త్రాగడం వలన శరీరం0లో పెరిగిన కొవ్వును కరిగిస్తుంది. ఈవిధంగా అధిక బరువు తగ్గుతారు. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ C మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మనం పీల్చే గాలి, త్రాగే నీటి వలన కూడా ఎక్కువ వ్యర్థ పదార్థాలు శరీరంలోనికి వెళతాయి అవి వేడి నీటితో కలిపి నిమ్మరసం త్రాగడం వలన శరీరం లోనుండి బయటకు పోతాయి. వేడి నీటిలో నిమ్మరసం కలిపి త్రాగడం వలన కిడ్నీలో రాళ్ళూ కరుగుతాయి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు రోజూ వేడి నీటిలో నిమ్మరసం త్రాగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటివి కూడా తగ్గుతాయి.

అలాగే మన శరీరంలోని సమస్యలకు కాదు ఇంట్లో సమస్యలకి కూడా నిమ్మకాయ ఇలా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ తెల్లని బట్టలు, పిల్లల బట్టలు మరియు మురికి బట్టలు తెల్లగా మారడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయను బట్టలపై బాగా రుద్ది ఒక పావుగంట సేపు ఉంచి తరువాత సబ్బు పెట్టి ఉతకాలి. ఈవిధంగా పసుపు అంటిన బట్టలను, ఎలాంటి మరకలు ఉన్న బట్టలను అయినా తెల్లగ అవుతాయి. నిమ్మకాయను సింక్ లలో కూడా రుద్ది కాసేపు నానబెట్టి తరువాత కడిగితే సింక్ శుభ్రపడుతుంది. కిచెన్ లో వాడే టవల్స్ వాటికీ ఉండే జిడ్డు వదలడానికి కూడా నిమ్మకాయను కాసేపు రుద్ది తర్వాత సబ్బుతో ఉతకాలి. నిమ్మరసంతో తుడిస్తే మురికి పోయి అద్దం కూడా మెరుస్తుంది. వంట పాత్రలకు సబ్బుతో పాటు నిమ్మకాయని కూడా రాసి కడిగితే అవి ఇంకా మెరుస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి