iDreamPost

శాండ్‌విచ్ తిని రూ. 6 లక్షలు టిప్పు.. ట్విస్ట్ ఏంటంటే!

అప్పుడప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో పొరపాటున వేరే నెంబర్ కి డబ్బు పంపి తర్వాత లబో దిబో అంటాం. వెంటనే బ్యాంక్ కి వెళ్లి తమ డబ్బు రికవరీ చేయాల్సిందిగా మొరపెట్టుకుంటారు.

అప్పుడప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో పొరపాటున వేరే నెంబర్ కి డబ్బు పంపి తర్వాత లబో దిబో అంటాం. వెంటనే బ్యాంక్ కి వెళ్లి తమ డబ్బు రికవరీ చేయాల్సిందిగా మొరపెట్టుకుంటారు.

శాండ్‌విచ్ తిని రూ. 6 లక్షలు టిప్పు.. ట్విస్ట్ ఏంటంటే!

కొన్నిసార్లు మనం చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా మంది ఏమరపాటు వల్ల తప్పిదాలు చేస్తుంటారు. తర్వాత చేసిన తప్పు తెలుసుకొని లబోదిబో అంటుంటారు. ఇటీవల కొన్ని బ్యాంకులు పొరపాటున కస్టమర్లకు కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి.. తమ తప్పు గ్రహించి వెంటనే రికవరీ చేసుకుంటున్నారు. మరికొంతమంది డిజిటల్ లావాదేవీల్లో పొరపాటున వేరేవాళ్లకు డబ్బు పంపి ఇబ్బంది పడుతున్నారు.ఓ మహిళ పొరపాటున వేరేవారి ఖాతాలో లక్షలు పంపి తర్వాత నానా తంటాలు పడింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ఓ మహిళ పొరపాటున భారీ మొత్తాన్ని టిప్‌ చేసింది. ఆ తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమంది.. నా డబ్బులు వెనక్కి ఇప్పించాలని బ్యాంకుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇటాలియన్ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన కానర్ అనే మహిళ శాండ్ విచ్ (రూ.628) ఆర్డర్ చేసింది. ఆ తర్వాత, ఆమె అనుకోకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి $7,000 అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 6 లక్షలకు పైగా టిప్‌ను పంపింది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది చాలా సంతోషించారు. ఆ మహిళది ఎంతో గొప్ప మనసు అని పొంగిపోయారు.

అసలు ఏం జరిగిందంటే, కానర్ తాను తిన్న పిజ్జాకు పేమెంట్ చేసే సమయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు ద్వారా పొరపాటున లావాదేవీ పూర్తి చేసింది. చివర్లో తాను చేసిన తప్పు గురించి తెలుసుకొని గుడ్లు తేలేసింది. వెంటనే బ్యాంక్ కి పరుగులు తీసింది. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె చేసిన అభ్యర్థనను మొదట తిరస్కరించారు. దాని గురించి ఏమీ చేయలేక, కానర్ సబ్వే నిర్వహణను ఆశ్రయించింది. చివరికి ఆమె పొరపాటున చెల్లించిన టిప్‌ను తిరిగి చెల్లించడానికి అంగీకరించింది. నెల రోజుల తర్వాత మహిళకు డబ్బు వాపసు ఇచ్చేందుకు అంగీకరించినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. మొత్తానికి తన డబ్బు తిరిగి తన ఖాతాలో పడుతందని తెలియడంతో మహిళ ఊపిరి పీల్చుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి