iDreamPost

ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్.. ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం

  • Published Jan 24, 2024 | 10:54 AMUpdated Jan 24, 2024 | 10:54 AM

దేశంలోని ఐటీ ఉద్యోగులకు మరోసారి ఊహించని షాక్ తగలనుంది. అగ్రరాయం అయిన అమెరికా ఆర్ధిక కష్టాల్లో ఉన్న కారణంగా.. ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

దేశంలోని ఐటీ ఉద్యోగులకు మరోసారి ఊహించని షాక్ తగలనుంది. అగ్రరాయం అయిన అమెరికా ఆర్ధిక కష్టాల్లో ఉన్న కారణంగా.. ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Jan 24, 2024 | 10:54 AMUpdated Jan 24, 2024 | 10:54 AM
ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్.. ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం

దేశంలో ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంటారు. అప్పటికే ఉద్యోగ వేటలో ఉండేవారు మరికొంతమంది ఉంటారు. ఇలా ప్రపంచం అంతా సాఫ్ట్ ఫేర్ రంగం చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరగాల్సింది పోయి.. నానాటికి తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగం ఏ స్థాయికి పడిపోయిందో గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాము. రెసిషన్ కారణంగా దేశంలోని ప్రముఖ దిగ్గజ సంస్థలు సైతం వారి ఉద్యోగులను.. లే ఆప్స్ పేరుతో తొలగించిన పరిస్థితులను చూశాము. ఇక ఇప్పుడిపుడే మార్కెట్ లో ఐటీ నిలదొక్కుకుంటుంది అనుకునే సమయంలో.. మరలా ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం అగ్రరాజ్యం అయిన అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడమే. దీనితో ఈ ఏడాది ఐటీ జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని.. నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తతం అమెరికాలో రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు.. ఇవన్నీ జాబ్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆర్ధికంగా అమెరికాను కష్టాలు చుట్టుముడుతున్నాయి. దీని కారణంగా చిన్న స్టార్ట్ అప్ కంపెనీలు మొదలుకుని.. పెద్ద పెద్ద కంపెనీల వరకు ఉద్యోగులను జాబ్ నుంచి తొలగిస్తున్నారు. గతంలోను అంటే 2022వ సంవత్సరంలో అమెరికన్ కంపెనీలు 363,832 మంది ఉద్యోగులకు లే ఆప్స్ ప్రకటించింది. ఇక 2023వ సంవత్సరంలో ఏకంగా 721,677 మంది ఎంప్లాయస్ ను ఉద్యోగాల నుంచి తొలగించింది. వారిలో ప్రముఖ దిగ్గజ సంస్థలైన మెటా, అమెజాన్ లో పని చేసే ఉద్యోగులే దాదాపు 16,8032 మంది ఉన్నట్లుగా ఓ సర్వేలో తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి.. ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. క్యూ 1లో రిక్రూట్మెంట్ తగ్గించి. ఉద్యోగులకు కోత విధించే దిశగా ప్రముఖ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని.. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గతంలో కోవిడ్ -19 సమయంలో ఐటీ సంస్థలలో భారీగా రిక్రూట్మెంట్ పెరిగిన మాటా వాస్తవమే.. కానీ, ఇప్పుడిప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో.. ఐటీ టెక్నాలజీ పడిపోతుందని చెప్పి తీరాలి. ఆర్ధిక మాంద్యం, ప్రాజెక్ట్స్ లేక ఆయా టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. దానికి ప్రత్యామ్న్యాయంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నారని.. ఆండీ ఛాలెంజర్ వెల్లడించారు. ఇక టెక్నాలజీ తర్వాత రిటైల్ , హెల్త్ కేర్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలోను ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్ధిక సామర్ధ్యాలను అనుగుణంగా.. ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మరి, చూడబోతుంటే అగ్రరాజ్యాల ఆర్ధిక కష్టాల దెబ్బ.. రానున్న రోజుల్లో దేశంలోని ఐటీ ఉద్యోగులకు భవిష్యత్ మీద బలంగా పడనుంది. మరి, ఈ విషయం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి