iDreamPost

వీడియో: ఆ టీమిండియా క్రికెటర్ నాకు స్ఫూర్తి.. UPSC టాపర్ అనన్య కామెంట్స్!

  • Published Apr 17, 2024 | 2:54 PMUpdated Apr 17, 2024 | 2:54 PM

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి మెరిశారు. ఫస్ట్ అటెంప్ట్​లోనే ఆలిండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. అలాంటి అనన్య ఓ టీమిండియా క్రికెటర్ తనకు ఇన్​స్పిరేషన్ అని చెప్పారు.

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి మెరిశారు. ఫస్ట్ అటెంప్ట్​లోనే ఆలిండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. అలాంటి అనన్య ఓ టీమిండియా క్రికెటర్ తనకు ఇన్​స్పిరేషన్ అని చెప్పారు.

  • Published Apr 17, 2024 | 2:54 PMUpdated Apr 17, 2024 | 2:54 PM
వీడియో: ఆ టీమిండియా క్రికెటర్ నాకు స్ఫూర్తి.. UPSC టాపర్ అనన్య కామెంట్స్!

కాంపిటీటివ్ ఎగ్జామ్స్​లో దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, కఠినంగా భావించే యూపీఎస్సీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రిజల్ట్స్​లో పాలమూరు మట్టిబిడ్డ అనన్య రెడ్డి మెరిశారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన అనన్య ఫస్ట్ అటెంప్ట్​లోనే సివిల్స్​లో ఆలిండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే సివిల్స్​ కలను నిజం చేసుకోవడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అనన్య జర్నీ, సివిల్స్ ర్యాంక్ కొట్టే వరకు ఆమె కష్టపడిన తీరు గురించి తెలుసుకుంటున్నారు. తాను ఈ స్థాయికి వరకు ఎలా చేరుకున్నది స్వయంగా అనన్య షేర్ చేశారు. టీమిండియాలోని ఓ స్టార్ క్రికెటర్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

డిగ్రీ చదువుతున్న టైమ్​లోనే సివిల్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టానన్నారు అనన్య రెడ్డి. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని చెప్పారు. హైదరాబాద్​లోనే సివిల్స్ కోచింగ్ తీసుకున్నానని.. ఆలిండియా లెవల్​లో మూడో ర్యాంక్ వస్తుందని మాత్రం ఊహించలేదన్నారు. భారత జట్టు స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ అంటే తనకు ఇష్టమని.. అతడే తనకు ఇన్​స్పిరేషన్ అని పేర్కొన్నారు. ‘విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్. అతడే నాకు స్ఫూర్తి. పట్టువదలని తత్వం, ఓటమిని ఒప్పుకోని యాటిట్యూడ్, క్రమశిక్షణ అతడి నుంచి నేర్చుకున్నా. ఫలితం ఎలా ఉన్నా మన వంతు కృషి చేస్తూనే ఉండాలనేది కోహ్లీ నుంచే స్ఫూర్తిగా పొందాను’ అని అనన్య రెడ్డి చెప్పుకొచ్చారు.

సివిల్స్ ప్రిపరేషన్ గురించి అనన్య మాట్లాడుతూ పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమించానన్నారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్​గా సెలక్ట్ చేసుకున్నానని తెలిపారు. సామాజిక సేవ చేయాలనే తపన అనేది తనకు చిన్నప్పటి నుంచే ఉందన్నారు. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ అని, అమ్మ గృహిణి అని అనన్య పేర్కొన్నారు. తమ ఫ్యామిలీలో సివిల్స్ సాధించిన తొలి వ్యక్తి తానేనని వివరించారు. మహబూబ్​నగర్ జిల్లాలోని పొన్నకల్ తన స్వగ్రామం అని.. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన మిరాండ హౌస్​లో జాగ్రఫీలో డిగ్రీ కంప్లీట్ చేశానని వ్యాఖ్యానించారు. కోహ్లీనే తనకు స్ఫూర్తి అంటూ అనన్య చెప్పడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. విరాట్ క్రికెటర్​గా తాను ఎదుగుతూ తన జర్నీ ద్వారా ఎంతో మందికి ఇన్​స్పిరేషన్​గా మారాడని మెచ్చుకుంటున్నారు. మరి.. కోహ్లీనే తనకు స్ఫూర్తి అంటూ సివిల్స్ టాపర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి