iDreamPost

Civils లో మెరిసిన తెలుగమ్మాయి.. దేశంలోనే మూడో ర్యాంక్

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సర్వీసులుగా భావించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగమ్మాయి దేశంలోనే మూడో ర్యాంక్ తో సత్తా చాటింది.

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సర్వీసులుగా భావించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగమ్మాయి దేశంలోనే మూడో ర్యాంక్ తో సత్తా చాటింది.

Civils లో మెరిసిన తెలుగమ్మాయి.. దేశంలోనే మూడో ర్యాంక్

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ వేరు. దేశ వ్యాప్తంగా యువత సివిల్ సర్వీసెస్ కోసం సన్నద్ధమవుతుంటారు. సివిల్స్ సాధిస్తే పేరుతో పాటు దేశానికి సేవ చేయొచ్చని భావిస్తుంటారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా కూడా పట్టు వదలకుండా సివిల్స్ సాధించే వరకు ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు యువత. మన దేశంలో సివిల్స్ కు ప్రాధాన్యత ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఏడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటుంది. సివిల్స్ సాధించాలని యువత బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాగే ఓ తెలుగమ్మాయి అంకితభావంతో చదివి ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించిన తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం నాడు రిజల్ట్స్ ను ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగమ్మాయి సత్తా చాటింది. ఏకంగా దేశంలోనే మూడో ర్యాంక్ సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటుకుంది. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివేదానినని వెల్లడించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు.

సివిల్స్ లో మొత్తం 1016 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ను ఆదిత్య శ్రీవాత్సవ సాధించారు. అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంక్‌ సాధించగా దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంక్‌ సాధించారు. 180మంది ఐఏఎస్, 200మంది ఐపీఎస్‌, 37మంది ఐఎఫ్‌ఎస్‌ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, కేంద్రంలోని పలు విభాగాల అధికారులను ఎంపిక చేయడానికి నిర్వహిస్తారు. యూపీఎస్సీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి