iDreamPost

Sooryavanshi : మల్టీ స్టారర్ విడుదలకు అనుకోని ఇబ్బంది

Sooryavanshi : మల్టీ స్టారర్ విడుదలకు అనుకోని ఇబ్బంది

ఎల్లుండి విడుదల కాబోతున్న మల్టీ స్టారర్ సూర్యవంశీకి తలనెప్పులు తొలగిపోలేదు. రెవిన్యూ షేరింగ్ విషయంలో మల్టీ ప్లెక్సులకు నిర్మాతలకు ఒప్పందం కుదరని కారణంగా వాటిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాలేదు. కేవలం సింగల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రస్తుతం టికెట్లు అమ్ముతున్నారు. హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగుళూరు చెన్నై లాంటి ప్రధాన నగరాలు దేంట్లోనూ కార్పొరేట్ మల్టీ ప్లెక్సుల బుకింగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందంలో ఏర్పడిన అయోమయం వల్లే ఈ జాప్యం జరుగుతోంది కానీ ఇంకో నలభై ఎనిమిది గంటలే సమయం ఉండటంతో ఆఘమేఘాల మీద డిస్కషన్లు జరుగుతున్నాయి కానీ ఇంకా కొలిక్కి రాలేదు.

అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ రణ్వీర్ సింగ్ నటించిన సూర్యవంశీ ఏడాదికి పైగా థియేటర్ల కోసం ఎదురు చూసింది. రెండు వందల కోట్ల డిజిటల్ డీల్స్ వచ్చినా నిర్మాణ సంస్థ రిలయన్స్ దర్శకుడు రోహిత్ శెట్టి చాలా ఓపిగ్గా ఎదురు చూశారు. తీరా ఇప్పుడు రిలీజ్ కు దగ్గరగా ఉన్నప్పుడు ఇలా జరగడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. మల్టీ ప్లెక్సుల వ్యవహార శైలి పట్ల గతంలోనూ ఇండస్ట్రీలో కామెంట్స్ వచ్చాయి. ఇంత పెద్ద సినిమాకు ఇలా చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్స్ పెడితే వసూళ్లు పరంగా చాలా ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడదంతా మిస్ అయినట్టే.

దేశవ్యాప్తంగా సూర్యవంశీకి వచ్చే కలెక్షన్ల మీద అందరి దృష్టి నెలకొంది. వచ్చే నెల నుంచి పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టబోతున్న నేపథ్యంలో దీనికి నమోదైన ఫిగర్స్ ని బట్టి భవిషత్తు గురించి ఒక అంచనా వస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందోనని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే మూడు వేల దాకా స్క్రీన్లను ప్రపంచవ్యాప్తంగా సిద్ధం చేయబోతున్నారు. ఇప్పుడీ ఇష్యూ మరికొద్ది గంటల్లో పరిష్కారం చేస్తారు కానీ ఇకపై మాత్రం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సూర్యవంశీతో పాటు పెద్దన్న, ఎనిమి, మంచి రోజులు వచ్చాయి రేపటి రేస్ లో ఉండబోతున్నాయి

Also Read : Bangaru Raju : నాగార్జున ధీమా అందుకోసమేనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి