iDreamPost

Ugadi 2024 Panchangam: మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఓ సమస్య!

  • Published Apr 08, 2024 | 11:58 AMUpdated Apr 08, 2024 | 3:36 PM

Ugadi 2024 Panchangam Mesha Rashi Phalalu in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు అనగా ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది. మరి ఈ ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండనుంది అంటే..

Ugadi 2024 Panchangam Mesha Rashi Phalalu in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు అనగా ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది. మరి ఈ ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండనుంది అంటే..

  • Published Apr 08, 2024 | 11:58 AMUpdated Apr 08, 2024 | 3:36 PM
Ugadi 2024 Panchangam: మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఓ సమస్య!

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో మేష రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మేష రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. వీటి గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో ఈ రాశి వారు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రోధీ నామ సంవత్సరంలో మేష రాశి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి ఏడాది విశేషంగా కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ ఏడాదిలో వీరు కొన్ని సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. కానీ అంతిమంగా వారే విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.

క్రోధి నామ సంవత్సరంలో మేష రాశి ఉద్యోగులకు మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈ రాశి ఉద్యోగులు ఈ ఏడాది తమ కెరీర్ లో ప్రగతి సాధిస్తారని.. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది అంటున్నారు. అలానే వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని.. అంటున్నారు.

అంతేకాక ఈ ఏడాది మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని.. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది మేష రాశి వారి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యక్తిగత, కుటుంబ జీవితం సవ్యంగా సాగుతుందని.. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని.. ఈ రాశి వారి పిల్లలు జీవితంలో అభివృద్ధి సాధిస్తారని పండితులు వెల్లడించారు. అయితే ఆర్థిక పరిస్థితి ఎంత అనుకూలించినా.. అనుకోని ఖర్చులు పెరుగుతాయని.. ఫలితంగా వ్యయాలు కూడా అధికంగా ఉంటాయని.. దీని పట్ల కాస్త జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.

ఇక ఈ ఏడాది మేశ రాశి విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారని.. కానీ ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ వెళ్తే విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఇక ఆరోగ్య పరంగా చూసుకుంటూ ఈ ఏడాది మేష రాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని.. కాకపోతే వాతావరణ మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది మేష రాశి వారికి

  • ఆదాయం- 8,
  • వ్యయం- 14,
  • రాజపూజ్యం- 4,
  • అవమానం- 3 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి