iDreamPost

IND vs PAK మ్యాచ్ లో జై శ్రీరామ్ నినాదాలు.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 16 October 23
IND vs PAK మ్యాచ్ లో జై శ్రీరామ్ నినాదాలు.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగి రెండు రోజులు కావొస్తోంది. కానీ ఏదో ఒక విషయంలో ఈ మ్యాచ్ తరచుగా వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. పాక్ క్రికెటర్ అవుట్ అయ్యి డ్రస్సింగ్ రూమ్ కు వెళ్తున్న క్రమంలో కొందరు టీమిండియా ఫ్యాన్స్ జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ సంఘటనపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. మరి స్టాలిన్ చేసిన కామెంట్స్ ఏంటి? బీజేపీ ఎందుకు ఫైర్ అవుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ కప్ లో శనివారం(అక్టోబర్ 14)న ఇండియా-పాక్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యి గ్రౌండ్ నుంచి డ్రస్సింగ్ రూమ్ కు వెళ్తున్నాడు. ఆ సమయంలో టీమిండియా ఫ్యాన్స్ జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోపై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి,డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “పాక్ ఆటగాళ్ల ముందు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదని, క్రీడలు దేశాలను ఐక్యపరచడానికి ఉపయోగపడాలి కానీ.. విద్వేషాల్ని రెచ్చగొట్టడానికి కాదు” అంటూ విమర్శించాడు.

ప్రస్తుతం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. బీజేపీ నేతల స్టాలిన్ పై ఫైర్ అవుతున్నారు. కొందరు ఫ్యాన్స్ తీరును తప్పు పడుతుంటే.. మరికొందరు స్టాలిన్ తీరును తప్పు పడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లో మ్యాచ్ కోసం పాక్ ఆటగాళ్లు చెన్నై వస్తారని వారికి స్వాగతం పలకండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు స్టాలిన్. మరి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి