iDreamPost
android-app
ios-app

Nvvu Nenu: వీడియో: నువ్వు నేను రీరిలీజ్.. ఉదయ్ కిరణ్ ని చూడగానే దద్దరిల్లిన థియేటర్స్!

  • Published Mar 22, 2024 | 2:15 PMUpdated Mar 22, 2024 | 2:15 PM

ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. ఈ రీరిలీజ్ సినిమాలతో థియేటర్స్ అన్ని కాన్సెర్ట్స్ లా మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయినా రీరిలీజ్ లలో ఓయ్ సినిమాకు బాగా ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ క్రేజ్ "నువ్వు నేను" సినిమా వంతైంది.

ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. ఈ రీరిలీజ్ సినిమాలతో థియేటర్స్ అన్ని కాన్సెర్ట్స్ లా మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయినా రీరిలీజ్ లలో ఓయ్ సినిమాకు బాగా ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ క్రేజ్ "నువ్వు నేను" సినిమా వంతైంది.

  • Published Mar 22, 2024 | 2:15 PMUpdated Mar 22, 2024 | 2:15 PM
Nvvu Nenu: వీడియో: నువ్వు  నేను రీరిలీజ్.. ఉదయ్ కిరణ్ ని చూడగానే దద్దరిల్లిన థియేటర్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ సినిమా రీరిలీజ్ చేసినా కూడా.. ప్రేక్షకులు ఆయా సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఆయా సినిమాలకు ఒరిజినల్ రిలీజ్ డేట్స్ లో రాని ఆదరణ కూడా.. రీరిలీజ్ ల సమయంలో వచ్చేస్తుంది. దీనితో ఏదైనా సినిమా రీరిలీజ్ అయిందంటే.. ఇక సోషల్ మీడియా అంతా ఆ సినిమాలోని ఐకానిక్ సీన్స్, సాంగ్స్ తో మోత మోగిపోతుంటుంది. అలానే ఇప్పుడు కూడా ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించిన “నువ్వు నేను” సినిమా అప్పట్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా, ఈ సినిమాకు తెచ్చా దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా మొత్తానికి కూడా ఆర్ఫీ పట్నాయక్ అందించిన సంగీతమే హైలెట్ అయింది. అయితే, ఈ సినిమాను మార్చి 21న థియేటర్స్ లో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, సీన్స్ అన్ని వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు ఉదయ్ కిరణ్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఈ హీరో కూడా తన సినిమాలతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే, ఈ హీరో నటించిన సినిమాలలో “నువ్వు నేను” సినిమా చాలా ప్రత్యేకమైనది. ఈసినిమాలో సునీల్ కామెడీ సీన్స్ , సాంగ్స్ , సినిమా కథ అన్నీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో “గాజువాక పిల్లా మేము గాజుల్లోళ్ళం కాదా.. ” సాంగ్ అయితే ఇప్పటికే అందరి మ్యూజిక్ ప్లే లిస్ట్ లో ముందుంటుంది. ప్రత్యేకించి ఈ సాంగ్ కు అప్పట్లోనే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేయడంతో.. మళ్ళీ ఈ సాంగ్ థియేటర్స్ లో దద్దరిల్లిపోతుంది. ఇప్పటి జెనరేషన్ వాళ్ళు ఈ సాంగ్ కు దుమ్మురేపే స్టెప్పులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రీరిలీజ్ హడావిడి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్స్ అన్నీ “నువ్వు నేను” మూవీ తో మరొకసారి కాన్సర్ట్స్ అయ్యాయి.

ఇక ఉదయ్ కిరణ్ విషయానికొస్తే .. ఈ హీరో మృతి వెనుక అప్పుడు చాలానే చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన అసలైన కారణాలైతే తెలియదు కానీ, ఒకవేళ ఈ హీరో కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న హీరోలకు మంచి పోటీ ఇచ్చి ఉండేవాడని భావిస్తున్నారు అభిమానులు. ఏదేమైనా అప్పటికి ఇప్పటికి ఉదయ్ కిరణ్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటున్నారు. ఇక ఇప్పుడు నువ్వు నేను సినిమా రీరిలీజ్ అవ్వడంతో.. మరొకసారి అందరు ఉదయ్ కిరణ్ ను గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు .. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి, ఈ విదేవులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ॐ (@raxx.hh)

 

View this post on Instagram

 

A post shared by ॐ (@raxx.hh)

 

View this post on Instagram

 

A post shared by ॐ (@raxx.hh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి