iDreamPost
android-app
ios-app

మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్స్ కోసం రెండు టైటిల్స్ లాక్!

  • Published Feb 16, 2024 | 4:30 PM Updated Updated Feb 16, 2024 | 4:30 PM

గుంటూరు కారం చిత్రం తర్వాత మహేష్ బాబు .. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

గుంటూరు కారం చిత్రం తర్వాత మహేష్ బాబు .. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

  • Published Feb 16, 2024 | 4:30 PMUpdated Feb 16, 2024 | 4:30 PM
మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్స్ కోసం రెండు టైటిల్స్ లాక్!

ఈ ఏడాది సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ నటించిన “గుంటూరు కారం” విడుదల అయ్యి.. ఫామిలీ ఆడియన్సు నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అలానే కలెక్షన్లు కూడా మంచిగానే రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం ఆన్ లైన్ ప్లాట్ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గుంటూరు కారం చిత్రం సక్సెస్ అయినా కూడా మరో వైపు మహేష్ అభిమానులుగా కాస్త దిగాలుగా ఉన్నారు. దానికి కారణం మహేష్ ఇప్పటిలో వెండితెరపై దర్శనం ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజమౌళితో కాబట్టి. సహజంగానే రాజమౌళి చిత్రాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ , రాజమౌళి కాంబినేషన్ అంటే .. భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, రాజమౌళి తీసే సినిమాలు ఆలస్యం అవుతుందని అందరికి తెలిసినా .. సినిమా చుసిన తర్వాత అందరికి వెయిట్ వర్తీ అనే ఫీలింగ్ ను కలిగేలా చేస్తాడు. కాబట్టి , మహేష్ సినిమా మీద కూడా ఇలాంటి ఆశలే అందరికి ఉన్నాయి. ఇప్పటికే అందరి అంచనాలకు మించి రాజమౌళి ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ భాద్యతను విజయేంద్ర ప్రసాద్ ఎంతో అద్భుతంగా పూర్తి చేశారని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా గురించి వినిపిస్తున్న కథనాల ప్రకారం .. ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని తెలియాజేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారు అనే దానిపైన ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.

అయితే, ఈ మూవీకి మహారాజా లేదా చక్రవర్తి అనే టైటిల్స్ ను పెట్టాలని అనుకుంటున్నారట. ఈ టైటిల్స్ అయితే, అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతో .. ఈ రెండిటిలో ఎదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని సమాచారం. దీని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు. అసలు కథ విషయంలో కానీ, టైటిల్ ను కథకు సరిపడా సెట్ చేసే విషయంలో కానీ, రాజమౌళిని మించిన వారు ఎవరు ఉండరని అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు ఎటువంటి హైప్ ని క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి. మరో వైపు ఫేమస్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ నెట్‌ ఫ్లిక్స్.. ఈ ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళికి సహకరించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడబోతుంటే ఈ సినిమాను తన క్రితం సినిమాల కంటే భారీగానే ప్లాన్ చేసినట్టున్నాడు జక్కన్న. మరి, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş