iDreamPost

ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారతీయ హైకమిషన్ అధికారులు అదృశ్యం

ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారతీయ హైకమిషన్ అధికారులు అదృశ్యం

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారత హైకమిషన్ అధికారులు అదృశ్యం అయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి వీరిద్దరూ అదృశ్యం అయినట్లు సమాచారం. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది.

ఇద్దరు అధికారుల అదృశ్యంపై పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కు పిర్యాదు చేశారు.

అయితే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని వీసా విభాగంలో పని చేసే ఇద్దరు పాకిస్తాన్ అధికారులు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని బహిష్కరణకు గురైన తరువాత పాకిస్తాన్‌లో ఇద్దరు భారత్ హైకమిషన్ అధికారులు అదృశ్యం అయిన సంఘటన జరిగింది.

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ పలువురు భారత్‌కు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్తలపై గత కొన్ని రోజులుగా నిఘా ఎక్కువైంది. ఈ నిఘాకు వ్యతిరేకంగా భారతదేశం నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియాకు చెందిన ఉన్నత స్థాయి దౌత్య అధికారి గౌరవ్ అహ్లువాలియా వాహనాన్ని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సభ్యుడు వెంబడించాడు. ఆ‌ అధికారి కారును ఐఎస్ఐ సభ్యుడు అనుసరిస్తూ వెళ్లాడు.

మార్చిలో పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ తన అధికారులు, సిబ్బందిని వేధించడాన్ని నిరసిస్తూ ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ విదేశాంగ శాఖకు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఒక లేఖను పంపింది. ఆ లేఖలో మార్చిలో చోటు చేసుకున్న కేవలం 13 సంఘటనలను ఉదహరించింది.‌ ఇటువంటి సంఘటనలకు స్వస్తి పలకాలని పాకిస్తాన్‌ను కోరింది. “ఈ సంఘటనలను అత్యవసరంగా దర్యాప్తు చేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు సంబంధిత ఏజెన్సీలకు సూచించండి” అని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి