iDreamPost

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. జూన్ 30 వరకు ఆ దర్శనాలు రద్దు!

TTD VIP Break Darshan: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

TTD VIP Break Darshan: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. జూన్ 30 వరకు ఆ దర్శనాలు రద్దు!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక ప్రత్యేక దినాలు, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రద్దీకి అనుగుణంగా దర్శన వేళలు, ఇతర విషయాల్లో మార్పులు చేస్తుంది. తాజాగా కూడా భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ముఖ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత వారం రోజులుగా తిరుమల కొండపైకి భక్తులు దర్శనానికి బారులు తీరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30వరకు ఆ దర్శనాలను రద్దు చేసినట్లు సమాచారం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వేసవి సెలవులు ముగుస్తుండటంతో  పాటు అన్ని రకాల పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తులు దర్శనానికి బారులు తీరారు. ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. అదే విధంగా వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తులు దర్శనానికి బారులు తీరారు. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనంకి ఏకంగా 30 గంటల సమయం పడుతుంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.

ముఖ్యంగా వారంతంపు మూడు రోజులు సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో  ఏకంగా 30 నుంచి 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.  ఈక్రమంలోనే వచ్చే నెల 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేసినట్లు తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో వచ్చే సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. ఈ  విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్రణాళికలు వేసుకోవాలని చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి