iDreamPost

TTD గుడ్ న్యూస్.. మే నెల దర్శనం టికెట్లపై ప్రకటన..

TTD Good News: తిరుమల తిరుపతి దేవస్థానం తమ భక్తులకు శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.

TTD Good News: తిరుమల తిరుపతి దేవస్థానం తమ భక్తులకు శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.

TTD గుడ్ న్యూస్.. మే నెల దర్శనం టికెట్లపై ప్రకటన..

తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మే నెలకు సంబంధించిన టికెట్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగ ప్రదక్షిణం, సుప్రభాతం, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, అర్చన వంటి సేవల టికెట్లు లక్కీ డిప్ ద్వారా పొందేందుకు.. ఎల్లుండి రిజస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఫిబ్రవరి 19 ఉదయం 10 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు.

తిరుమలలో కొలువుదీరి ఉన్న ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తూ ఉంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యేక సేవల్లో పాల్గొనేందుకు వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయని అందరికీ తెలిసిందే. వాటిని ఏ నెలకు ఆ నెల ముందుగానే టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేస్తూ ఉంటారు. మే నెలకు సంబంధించి స్వామివారి ప్రత్యేక దర్శనం, సేవలకు సంబంధించిన టికెట్ల కోసం లక్కీ డిప్ లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆ రోజే మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తుల వివరాలు కలిగిన జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తారు. అదేరోజు 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల టోకా దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

అలాగే ఫిబ్రవరి 24వే తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. రూ.300 టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులకు సంబంధించిన కోటాను కూడా విడుదల చేయబోతున్న విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే నెలలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మే నెల కోటా టికెట్లకు చాలానే డిమాండ్ ఉండే ఆస్కారం ఉంటుంది. వేసవి సెలవులు కావడం, జూన్ నెలలో పాఠశాలలు, విద్యాసంస్థలు రీపెన్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది మే నెలలో తిరుమల దర్శనానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. మరి.. మే నెల కోటా టికెట్లను ఫిబ్రవరి 19 నుంచి విడుదల చేయనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి