iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. RTCలో 3,500 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు తీపి కబురు. టీఎస్ ఆర్టీసీలో 3500 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు తీపి కబురు. టీఎస్ ఆర్టీసీలో 3500 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. RTCలో 3,500 ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి సమయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఎప్పటి నుంచో జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ అందించింది. టీఎస్ ఆర్టీసీలో 3, 500 ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించి ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది టీఎస్ ఆర్టీసీ. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఎనలేని ఆదరణ పొందింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీల్లో భాగంగా మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది టీఎస్ ఆర్టీసీ. గత పదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణలు తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఈ కారణంగా ఆర్టీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది.

టీఎస్ ఆర్టీసీలో 3500 ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే కొత్తగా భర్తీ చేయబోయే ఆర్టీసీ ఖాళీ పోస్టుల్లో డ్రైవర్ పోస్టులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కండక్టర్ పోస్టులు తక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో RTCలో 42,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 14,747 మంది డ్రైవర్లు, 17,410 మంది కండక్టర్లు ఉన్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలివే :

  • డ్రైవర్: 2000
  • శ్రామిక్: 743
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) :114
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 84
  • డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్: 40
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 23
  • మెడికల్ ఆఫీసర్: 14
  • సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
  • అకౌంట్స్ ఆఫీసర్: 6

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి