iDreamPost

వైఎస్ జగన్ బాటలో కేసీఆర్.. ఇంగ్లీష్ మీడియంకి గ్రీన్ సిగ్నల్

వైఎస్ జగన్ బాటలో కేసీఆర్.. ఇంగ్లీష్ మీడియంకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రతిపక్షం తప్ప మిగతా అన్ని రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న అనేక విషయాలను తెలంగాణలో కూడా అమలు చేస్తూ వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశపెట్టాల‌ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో జనవరిలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించి విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కూడా చేయాలని నిర్ణయించారు.

నిజానికి ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టడమే కాక కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టం కూడా తీసుకొచ్చింది ప్ర‌పంచ వ్యాప్తంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు గాను ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా , దాన్ని పేద‌లు చ‌దువుకునే ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ప్ర‌వేశపెట్టాల‌ని జగన్ సహృదయంతో నిర్ణ‌యం తీసుకుంటే దానికి రాజ‌కీయ రంగు పులిమారు. అంతేకాక తెలుగుకు అన్యాయం జరుగుతోంది అంటూ న్యాయ‌స్థానం మెట్లు కుడా ఎక్కారు.

కానీ ఇప్పుడు అదే ఏపీని ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ సర్కార్ ముందుకు వెళ్ళింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫీజుల విధానం, తిరుపతి రావు కమిటీ రిపోర్ట్ పై చర్చించామని ఆమె పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ పై విధివిధానాలు రూపొందించాలని అధికారులను కోరామని కూడా ఆమె వెల్లడించారు. ఇక ఏపీలో మన బడి-నాడు నేడు పథకాన్ని పోలి ఉన్న మన ఊరు మన బడి పథకాన్ని ఈ నెల 8 న వనపర్తి లో సీఎం ప్రారంభించనున్నారని సమాచారం. మరి అప్పుడు రాద్ధాంతం చేసిని వారు ఇప్పుడు ఏమంటారో? మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి