iDreamPost
android-app
ios-app

వారికి రూ.లక్ష సాయం అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్లై చేసుకొండి!

  • Published Jul 29, 2023 | 8:59 AM Updated Updated Jul 29, 2023 | 8:59 AM
  • Published Jul 29, 2023 | 8:59 AMUpdated Jul 29, 2023 | 8:59 AM
వారికి రూ.లక్ష సాయం అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్లై చేసుకొండి!

త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అడుగులు ముందుకు వేస్తోంది. అన్ని వర్గాల ప్రజల కోసం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకురావడం మాత్రమే కాక.. వాటిని వెంటనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం సరి కొత్త పథకాలను తీసుకొస్తోంది. ఇప్పటికే దళితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకుగాను దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదేకాక రాష్ట్రంలోని చేతివృత్తులు, కులవృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఇక ఇప్పడు మైనార్టీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు.. బీసీ బంధు మాదిరిగానే.. వంద శాతం సబ్సిడీతో.. మైనార్టీలకు కూడా లక్ష రూపాయలు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అమలు దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది కేసీఆర్‌ సర్కార్‌. ఈ పథకానికి 23వ తేదీన ప్రభుత్వం అధికారిక జీవోను విడుదల చేయగా.. విధివిధానాలు, అర్హతలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈపథకం కింద ముస్లిం, క్రిస్టియన్లకు.. ఆయా కమ్యూనిటీలు, కార్పోరేషన్‌ నిధుల నుంచి ఈ ఆర్థిక సాయం అందిచనుంది సర్కారు. ఈ క్రమంలోనే.. క్రిస్టియన్లకు ఈ లక్ష​ రూపాయల ఆర్థిక సాయం అందిచేందుకుగాను ఆ కమ్యూనిటీ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు www.tsobmms.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్ల వయస్సున్న వారే అర్హులని ప్రభుత్వం వెల్లడించింది. అందులోనూ.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారైతే వారి వార్షికాదాయం లక్షన్నర రూపాయలలోపు ఉండాలని.. అలానే పట్టణ ప్రాంతం వాళ్లైతే వారి వార్షికాదాయం రెండు లక్షల లోపు ఉండాలని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం.. జిల్లా మైనారిటీ అధికారిని గానీ.. క్రిస్టియన్ కార్పొరేషన్ కార్యాలయంలో లేదా 040-23391067 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.