iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం..

  • Published Nov 06, 2023 | 1:32 PMUpdated Nov 06, 2023 | 1:32 PM

గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రచార కార్యక్రమాల కోసం హెలికాప్టర్‌లో బయలుదేరగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌.. ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. రోజుకు రెండు, మూడు ప్రాంతాల్లో​ పర్యటిస్తూ.. సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయం గుర్తించి అప్రమత్తమైన పైలట్‌ మార్గమధ్యలోనే హెలికాప్టర్‌ని ల్యాండ్‌ చేశాడు.

కొద్ది సేపటి క్రితమే కేసీఆర్‌.. హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే సాంకేంతిక సమస్య రావడంతో.. మార్గమధ్యలోనే ల్యాండ్‌ చేసి.. సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి సురక్షితంగా తీసుకెళ్లారు. సీఎం పర్యటన కోసం ఏవియేషన్‌ అధికారులు మరో హెలికాప్టర్‌ను సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది రెడీ కాగానే కేసీఆర్‌ దేవరకద్రకు తిరిగి బయలుదేరతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి