iDreamPost

రాహుల్‌ మా బలం నీకు తెలియదు.. మేము తల్చుకుంటే: ఒవైసీ

  • Published Nov 03, 2023 | 2:04 PMUpdated Nov 03, 2023 | 2:04 PM

ఎంఐఎం పార్టీ.. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని.. దాని కోసం పని చేసిందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు.. ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు అసదుద్దీన్‌ ఒవైసీ. ఆ వివరాలు..

ఎంఐఎం పార్టీ.. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని.. దాని కోసం పని చేసిందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు.. ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు అసదుద్దీన్‌ ఒవైసీ. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 2:04 PMUpdated Nov 03, 2023 | 2:04 PM
రాహుల్‌ మా బలం నీకు తెలియదు.. మేము తల్చుకుంటే: ఒవైసీ

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. శుక్రవారం తెలంగాణ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఉ.11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10. నవంబర్ 13న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రాకు నవంబర్ 15 వరకు అవకాశం ఇచ్చారు. ఇకనవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలకు సమయం తరుముకొస్తుండటంతో.. పార్టీలన్ని స్పీడ్‌ పెంచాయి. ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మీద ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. తీవ్రంగా మండి పడ్డారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. ఎంఐఎం పార్టీ.. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని.. వాళ్ల కోసం పని చేస్తోంది అంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మతపరమైన విద్వేషం కారణంగానే.. రాహుల్‌ గాంధీ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఒవైసీ మండి పడ్డారు. గురువారం సాయంత్రం సంగారెఎడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించారు. మా బలం మీకు తెలియదు.. మేం తల్చుకుంటూ.. మీరు ఎక్కడ ఉంటారో తెలుసా అంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు.

‘‘కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ.. ఢిల్లీలోని నా ఇంటికి ఒకరిని పంపారు. ఆ రహస్యం ఏంటో చెప్పమంటారా.. నేను మీ గురించి చాలా చెప్పగలను. రాహుల్‌ మా బలం మీకు తెలియదు. మా బలాన్ని గుర్తించి.. ఇందిరా గాంధీ దారుసలాంకు వచ్చింది. ఈ గడ్డం టోపీదారులే ఎన్నికల్లో మీకు తగిన సమాధానం చెబుతారు. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం.మేం డబ్బు తీసుకుని పని చేస్తున్నాం అంటారా.. అమేథిలో ఓడిపోవడానికి బీజేపీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు. మీ స్నేహితులు సింధియా, జితిన్‌ ప్రసాద్‌లు బీజేపీలో చేరారు. కానీ వాళ్లేవరిపైనా డబ్బులు తీసుకున్నారంటూ మీరు ఆరోపణలు చేయరు. ఎందుకంటే.. మీకు మేమంటే ద్వేషం’’ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి