iDreamPost

ఈ నేతలు తమకు తాము ఓటేసుకోలేరు.. ఎందుకంటే

  • Published Nov 30, 2023 | 10:29 AMUpdated Nov 30, 2023 | 10:29 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే జనాలు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేస్తున్నారు. అయితే కొందరు కీలక నేతలు మాత్రం తాము పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో ఓటు వేయలేకపోతున్నారు. మరి వారు ఎవరంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే జనాలు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేస్తున్నారు. అయితే కొందరు కీలక నేతలు మాత్రం తాము పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో ఓటు వేయలేకపోతున్నారు. మరి వారు ఎవరంటే..

  • Published Nov 30, 2023 | 10:29 AMUpdated Nov 30, 2023 | 10:29 AM
ఈ నేతలు తమకు తాము ఓటేసుకోలేరు.. ఎందుకంటే

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. జనాలు పోలింగ్ సెంటర్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి.. క్యూలో నిల్చొని ఓటు వేస్తున్నారు. అగ్ర నేతలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వెళ్లారు. రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ ఎన్నికల సమరంలో హోరాహోరీగా దూసుకుపోతూ.. ప్రచారాన్ని నిర్వహించారు నేతలు. తమనే గెలిపించాలని.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే ఇన్ని రోజులు ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అగ్ర నేతలు ఈ ఎన్నికల్లో తమకు తాము ఓటేసుకునే అవకాశం లేదు. ఎందుకు అంటే..

సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలు తమకు తాము ఓటేసుకోలేకపోతున్నారు. అందుకు కారణం వారి ఓట్లు.. వారు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో లేవు. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్‌ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. దాంతో ఆయన తన ఓటును చింతమడకలోనే వినియోగించుకోనున్నారు. అలానే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్‌ నియోజకవర్గంలో ఉంది. దాంతో ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు.

అలానే బాన్సువాడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఈ క్రమంలో బాన్సువాడలో పోటీ చేస్తోన్న రవీందర్ రెడ్డి తన ఓటును ఎర్రాపహడ్ లో వేయనున్నారు. అలానే ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్‌ నగరంలో ఉంది.

అలానే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్‌మోహన్‌రావు ఓటు హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఉంది. దాంతో ఈ నేతలంతా తాము పోటీ చేసే నియోజకవర్గాల్లొ కాక.. తమకు ఓటు ఉన్న ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. వారంతా తమకు ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మోరాయిస్తున్నాయి. దాంతో పోలింగ్ ఆలస్యం అయ్యింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు పోలింగ్ ముగియనుంది. ఇక డిసెంబర్ 1న అనగా మూడు రోజుల్లో ఫలితాలు వెలువడతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి