iDreamPost

TS Young Leaders: బరిలోకి దిగిన తొలిసారే సత్తా చాటిన యంగ్ లీడర్స్.. ఇదీ సక్సెస్ అంటే..!

  • Author singhj Updated - 08:53 AM, Mon - 4 December 23

Young Leaders & Young Talent After Telangana Elections 2023 Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు యువ నేతలు బరిలోకి దిగినే తొలిసారే సత్తా చాటారు. వాళ్ల గెలుపును చూసి ఇదీ సక్సెస్ అని అందరూ పొగుడుతున్నారు.

Young Leaders & Young Talent After Telangana Elections 2023 Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు యువ నేతలు బరిలోకి దిగినే తొలిసారే సత్తా చాటారు. వాళ్ల గెలుపును చూసి ఇదీ సక్సెస్ అని అందరూ పొగుడుతున్నారు.

  • Author singhj Updated - 08:53 AM, Mon - 4 December 23
TS Young Leaders: బరిలోకి దిగిన తొలిసారే సత్తా చాటిన యంగ్ లీడర్స్.. ఇదీ సక్సెస్ అంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని స్థాయిలో హవా నడిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్​కు ఆ పార్టీ చేరువవుతోంది. ఈ ఎలక్షన్స్​లో ఆ పార్టీ నుంచి పలువురు యంగ్ క్యాండిడేట్స్ విజయబావుటా ఎగురవేశారు. ఇంతకుముందు వరకు పాలిటిక్స్​తో ఎలాంటి కనెక్షన్ లేకపోయినా బరిలోకి దిగిన ఫస్ట్ టైమే సత్తా చాటి గెలుపుఢంకా మోగించారు. మెదక్​లో మైనంపల్లి రోహిత్​రావుతో పాటు నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తిలో యశస్విని రెడ్డి పోటీ చేసిన తొలిసారే విజయాలు నమోదు చేసి సంచనలం సృష్టించారు.

డాక్టర్ నుంచి ఎమ్మేల్యేగా..

మెదక్ నియోజకవర్గం నుంచి 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి మీద ఆయన నెగ్గారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్​రావు కొడుకైన రోహిత్​రావు మేడ్చల్​లోని మెడిసిటీ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించడం విశేషం. హైదరాబాద్​లో డాక్టర్​గా ఉంటూనే మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సేవలు అందిస్తున్నారాయన. మెదక్ నుంచి రోహిత్​కు టికెట్ ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు ఎంతగా ప్రయత్నించినా అందుకు బీఆర్ఎస్ నిరాకరించింది. దీంతో కుమారుడితో కలసి ఆయన కాంగ్రెస్​లో చేరారు. విస్తృత క్యాంపెయినింగ్​తో ప్రజలకు దగ్గరైన రోహిత్ 9 వేలకు పైగా మెజారిటీతో పద్మా దేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు.

ఆఖరి నిమిషంలో వచ్చి.. మంత్రినే ఓడించి..

జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్​గా 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆమె గెలుపు ఒకరకంగా అనూహ్యమనే చెప్పాలి. తన ప్రత్యర్థి, బీఆర్‌‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును ఆమె ఓడించడం సంచలనంగా మారింది. ఎంతో ఛరిష్మా కలిగిన దయాకర్​రావును ఓడించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు యశస్విని. 2018లో బీటెక్ కంప్లీట్ చేసిన ఆమె.. మ్యారేజ్ తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొన్నాళ్లు జాబ్ చేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తొలుత వేరే అభ్యర్థిని ప్రకటించింది. ఎలక్షన్స్​కు కొన్ని రోజుల ముందు ఫారెన్ నుంచి వచ్చిన ఝాన్సీరెడ్డిని క్యాండిడేట్​గా సెలక్ట్ చేసింది. అయితే మన దేశ పౌరసత్వం విషయంలో సమస్య ఏర్పడటంతో ఆమె పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆమె ప్లేసులో కోడలు యశస్వినికి ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది.

విమెన్ కోటాలో వచ్చి విజయబావుటా..

రోహిత్​రావు, యశస్వినితో పాటు తెలంగాణ ఎన్నికల్లో మరో యువ అభ్యర్థి విజయం సాధించారు. ఆమెనే నారాయణపేట నియోజకవర్గం నుంచి నెగ్గిన 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి. బీఆర్ఎస్ క్యాండిడేట్ రాజేందర్​రెడ్డి మీద 7,950 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ప్రస్తుతం భాస్కర మెడికల్ కాలేజీలో పీజీ (రేడియోలజిస్ట్) చేస్తున్నారామె. ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్యేల్యేగా పనిచేశారు. పర్ణిక తండ్రి చిట్టెం వెంకటేశ్వర్​రెడ్డి పీసీసీ మెంబర్​గా ఉన్నారు. అయితే 2005లో మావోయిస్టుల కాల్పుల్లో తాత నర్సిరెడ్డితో పాటు తండ్రి వెంకటేశ్వర్​రెడ్డిని కోల్పోయారామె. అయితే 2009లో కొత్తగా ఏర్పాటైన నారాయణ పేట నియోజకవర్గ పాలిటిక్స్​లో ఆమె మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు పోటీ చేసి తక్కువ తేడాతో ఓడిపోయారాయన. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎలక్షన్స్​లో మహిళా కోటాలో పర్ణికకు ఛాన్స్ ఇచ్చింది. కాగా, బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ.. పర్ణికకు మేనత్త కావడం విశేషం. మరి.. తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు యువనేతలు పోటీ చేసిన మొదటిసారే గెలుపుబావుగా ఎగురవేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: YS Sharmila: కాంగ్రెస్‌ ఘన విజయం! YS షర్మిలకు కీలక పదవి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి