iDreamPost

షన్ను అరెస్టుపై ఫ్రెండ్స్ చెప్పిన నిజాలు! ఒక్కొక్కటిగా బయటకి!

బిగ్ బాస్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్టుపై కీలక విషయాలు వెల్లడించారు అతడి ఫ్రెండ్స్. షన్ను అరెస్టుపై అతడి ఫ్రెండ్ చెప్పిన విషయాలను.. ప్రముఖ యాంకర్ ధనుష్.. గీతూ గలాటాలు వెల్లడించారు.

బిగ్ బాస్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్టుపై కీలక విషయాలు వెల్లడించారు అతడి ఫ్రెండ్స్. షన్ను అరెస్టుపై అతడి ఫ్రెండ్ చెప్పిన విషయాలను.. ప్రముఖ యాంకర్ ధనుష్.. గీతూ గలాటాలు వెల్లడించారు.

షన్ను అరెస్టుపై ఫ్రెండ్స్ చెప్పిన నిజాలు! ఒక్కొక్కటిగా బయటకి!

సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశాడని, తనతో ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని, మరో మహిళను వివాహం చేసుకున్నాడంటూ విజయవాడకు చెందిన డాక్టర్ మౌనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సంపత్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లారు పోలీసులు. అక్కడకు వెళ్లాక.. షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే.. షన్ను తరుఫు లాయర్.. కళ్యాణ్ దిలిప్ సుంకర మాట్లాడుతూ..ప్రత్యక్ష సాక్షులు, అతడి తండ్రి చెప్పిన దాని ప్రకారం.. ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్‌కు అతడికి ఎలాంటి సంబంధం లేదని, సోదరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని పోలీసులు కోరితే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతోనే అతడ్ని విచారించేందుకు తీసుకు వచ్చారంటూ పేర్కొన్నారు.

కాగా, షన్ను అరెస్టు వెనుక అసలు నిజాలు అతడి ఫ్రెండ్స్ నుండి అడిగి తెలుసుకున్నారు యాంకర్ ధనుష్. బిగ్ బాస్ ఫేం గలాటా గీతు యూట్యూబ్ ఛానల్ ద్వారా సంచలన విషయాలు వెల్లడించాడు. ‘మీడియాలో షన్ను గురించి రకరకరాల న్యూస్‌లు వస్తున్నాయి. షన్ను మోసం చేసిన అమ్మాయి కంప్లయింట్ చేసిందని, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటూ దొరికి పోయాడంటూ వార్తలు వస్తున్నాయి. అసలు నిజాలు ఏంటని షన్ను, నాకు కామన్ ఫ్రెండ్స్ ను అడిగితే..అసలు విషయాలు తెలిశాయి. బుధవారం రాత్రి.. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ వినయ్‌ను పట్టుకుందామని పోలీసుల్ని అతడి ఫ్లాట్‌కు తీసుకెళ్లింది. షన్ను రెడ్ హ్యాండెడ్‌గా గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడు. 16 గ్రాములు గంజాయి దొరికింది. వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, పిల్స్ కానీ ఏం లభించలేదు. ప్రస్తుతం షన్ను పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి.. ఏం చెబితే ఏం జరుగుతుందో అని.. వాళ్లు ఎక్కువ మాట్లాడటం లేదు. ఫోనులో కూడా కొంత సమాచారమే ఇస్తున్నారు.’అని యాంకర్ ధనుష్ వెల్లడించాడు.

గీతూ మాట్లాడుతూ.. ‘వినయ్ వేరొకరితో పెళ్లి అయిపోయిందని,వేరే వారితో లివింగ్ ఇన్ రిలేషన్ షి‌లో ఉన్నారని చెబుతున్నారు. కానీ అది అవాస్తవం. వాస్తవానికి 2021లోనే వినయ్, మౌనికకి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్పట్లోనే పెళ్లి అంటూ నాతో మౌనిక చెప్పింది. అయితే కొన్ని ఇష్యూస్ వల్ల.. కొంత గ్యాప్ వచ్చింది. నవంబర్‌లో పసుపు దంచారు. ఈ నెల 28న పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. వెన్యూకి కూడా డబ్బులు ఇచ్చేశారు. ఇంతలో.. మౌనిక.. వినయ్ స్నేహితుల్లో ఒకరితో మాట్లాడగా.. తను ఇంకే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని వెల్లడించింది గీతూ..

‘ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. సమస్య ఉంటే.. ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ.. ఇలా చేయడం సరైంది కాదు. నాకు మౌనిక కొన్ని సంవత్సరాల నుండి తెలుసు. తను చాలా సెన్సిటివ్. మౌనిక డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్టో తెలియదు. స్కిన్ కు ఎలాంటి ప్రొడక్ట్ మంచివి అని ఆమెను అడిగి తెలుసుకునేదాన్ని. అయితే వినయ్‌కు పెళ్లి అయితే కాలేదు. కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది’ అని చెప్పింది గీతూ రాయల్. ఇంకా కొన్ని అభిప్రాయాలను కూడా పంచుకున్నారు గీతూ గలాటా అండ్ ధనుష్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి