iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో పెను విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..

  • Published May 12, 2024 | 2:02 PM Updated Updated May 12, 2024 | 2:31 PM

సినీ పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. ఇక క్రితం వారం రోజుల్లో వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు.. ఎందరో కన్ను మూశారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి ఒకరు కన్ను మూశారు. ఆ వివరాలు..

సినీ పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. ఇక క్రితం వారం రోజుల్లో వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు.. ఎందరో కన్ను మూశారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి ఒకరు కన్ను మూశారు. ఆ వివరాలు..

  • Published May 12, 2024 | 2:02 PMUpdated May 12, 2024 | 2:31 PM
ఇండస్ట్రీలో పెను విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..

ప్రస్తుతం మన దగ్గర సినిమా తారలకి మించి.. బుల్లితెర నటీనటులకు విపరీతమైన క్రేజ్ ఉంది. సీరియల్ తారలకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతి పోతుంది. వేర్వేరు చానెల్స్ లో.. విభిన్నమైన సీరియల్స్ లో.. భిన్నమైన పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇక బుల్లితెర మీద లేడీ విలన్లకు ప్రత్యేక స్థానం ఉంది. కళ్లతోనే ఎన్నో క్రూరమైన హవభావాలు పలికిస్తూ.. ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంటున్నారు. ఇలా బుల్లితెర మీద వరుస సీరియల్స్ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి ఒకరు ఆదివారం నాడు కన్నుమూశారు. ఆ వివరాలు..

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించారు. త్రినయని సీరియల్ ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర. ఈ క్రమంలో ఆమె ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్లో ఆమె మృతి చెందినట్లు సమాచారం.

పవిత్ర.. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం తెల్లవారుజామున పవిత్ర ప్రయాణిస్తున్న తన కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీకొట్టి.. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది అని తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మరణించింది. ఆమెతోపాటు కారులో కొందరు నటులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో పవిత్ర జయరామ్ బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్.. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. కన్నడ సీరియల్ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన పవిత్ర… మాండ్య తాలూకాలోని హనకెరెకు చెందినవారు. ‘రోబో ఫ్యామిలీ’, ‘జోకలి’, ‘నీలి’, ‘రాధారామన్’ వంటి కొన్ని సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు తెలుగులో త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో నటిస్తు.. ఎందరో అభిమానులను సంపాదించుకున్న పవిత్ర.. ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడంతో.. ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetcratosroyalbetmatbet girişjojobetdeneme bonusudeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobetjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibomcasibomjojobetcasibom giriş