Uppula Naresh
Uppula Naresh
ఈమె పేరు కల్యాణి. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకుంది. అయితే ఆమెకు పోలీస్ ఉద్యోగం సాధించాలనేది ఆమె కల. అందుకోసం దాదాపు రెండు, మూడేళ్ల నుంచి రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. ఇటీవల పోలీస్ పరీక్ష రాసి అర్హత కూడా సాధించింది. మరికొన్ని రోజుల్లో ఫలితాలు రానున్న తరుణంలోనే కల్యాణి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి ఈ యువతి ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిదంటే?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా గట్లమాల్యాల గ్రామంలో హరీష్-కల్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 4 నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లైన రెండు మూడు నెలల పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కల్యాణి ఇటీవల పోలీస్ పరీక్షలు రాసి అర్హత కూడా సాధించింది. కాగా మరికొన్ని రోజుల్లోనే ఫైనల్ ఫలితాలు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే కల్యాణి అత్తింటివారు పోలీస్ ఉద్యోగం వద్దంటూ ఆమెను వేధింపులకు గురి చేశారు.
కల్యాణికి మాత్రం పోలీస్ ఉద్యోగం సాధించాలనేది కల. దీనికి అత్తింటి కుటుంబ సభ్యులు కాదనడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే కల్యాణి ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అత్తింటివారు పోలీస్ ఉద్యోగం వద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.