iDreamPost
android-app
ios-app

తెలుగు నిర్మాత చేతికి.. ‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్’ ఆలిండియా రైట్స్!

  • Author ajaykrishna Updated - 11:17 AM, Wed - 23 August 23
  • Author ajaykrishna Updated - 11:17 AM, Wed - 23 August 23
తెలుగు నిర్మాత చేతికి.. ‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్’ ఆలిండియా రైట్స్!

శ్రీలంక క్రికెట్ దిగ్గజం.. టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు కొల్లగొట్టిన ఏకైక బౌలర్.. ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ‘800’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమ నంబియర్ కనిపించనున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ ఎంఎస్ శ్రీపతి రూపొందించారు. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించిన ఈ సినిమాకు 2022 బుకర్ ప్రైజ్ గ్రహీత.. షెహన్ కరుణతిలక స్క్రిప్ట్ అందించడం విశేషం.

ఇక మురళీధరన్ పాత్రలో మొదట మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. కానీ.. తమిళ ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఏర్పడటంతో ప్రాజెక్ట్ నుండి విజయ్ తప్పుకున్నారు. ఆ తర్వాత మధుర్ మిట్టల్ ఓకే చేసి మూవీ తెరకెక్కించారు. మొత్తానికి ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోందని తెలుస్తుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. 800 మూవీ ఆలిండియా రిలీజ్ రైట్స్ ని తెలుగు ప్రొడ్యూసర్ సొంతం చేసుకోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్. తమిళ భాషలో రూపొందిన ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. “ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఆయన రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన ఎన్నో సంఘటనలను ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో.. 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత ఆయనది. ఆయన చిన్నప్పటి నుండి సాగిన జర్నీ మొత్తం ఇందులో ఉంటుంది. ఈ సినిమాని ఆలిండియా వైడ్ రిలీజ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. గతేడాది యశోద మంచి విజయం అందించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా సిద్ధం అవుతోంది. ప్రస్తుతానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి సెప్టెంబర్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత అక్టోబర్ లో మూవీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు. మరి 800 మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.