iDreamPost

టాలీవుడ్ సమస్యలు – చర్చల్లో పురోగతి

టాలీవుడ్ సమస్యలు – చర్చల్లో పురోగతి

ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించుకోవడానికి షూటింగులు బంద్ చేసి మరీ చర్చల్లో ఉన్న పరిశ్రమ పెద్దలు ఒక్కో ఇష్యూ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ డిస్కషన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు రాను రాను విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని ఎలా నియంత్రించాలనే మీద రకరకాల వాదోపవాదాలు కొనసాగాయని తెలిసింది. మా అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ మంచు విష్ణుతో పాటు మరికొందరు సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రత్యేక కారవాన్లు, వాళ్ళ సిబ్బందికి జీతభత్యాలు ఇవన్నీ నిర్మాత మీదే వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందిని మాట్లాడుకున్నారని వినికిడి

థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు భారంగా మారుతున్న వర్చువల్ ఫీజుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. ఆ మేరకు నిన్నో ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఇది మరీ ఎక్కువగా ఉండటంతో మొదటి మూడు రోజులు గడిచాక వీక్ డేస్ లో చిన్న చిత్రాలకు బాగా కష్టంగా ఉంది. అందుకే ఇది పరిష్కరించేందుకు క్యూబ్, యుఎఫ్ఓ తదితర సంస్థలకు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నారు. ఇక సినిమా డిజాస్టర్ అయినా సరే తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు రెమ్యునరేషన్లు పెంచేసి ముక్కుపిండి వసూలు చేస్తున్న హీరోల ధోరణి గురించి కూడా పలువురు అభ్యంతరం లేవలేత్తినట్టుగా ఇన్ సైడ్ టాక్. హిట్ అయినా సరే మరీ ఇంతలా చేయకూడదన్నది ప్రధాన కంప్లైంట్

మరోవైపు ఓటిటి గ్యాప్ గురించి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఎనిమిది వారాల నిడివి పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డిజిటల్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లో భారీ కొత్త విధిస్తాయని దీని వల్ల ఆర్థికంగా నష్టమే తప్ప కలిగే ప్రయోజనం ఏముంటుందని వాళ్ళ వాదన. అలా కాకుండా ఫలితాన్ని బట్టి మార్చుకునే వెసులుబాటు ఉంటేనే ప్రొడ్యూసర్ కు మేలు కలుగుతుందన్న వాదనలో లాజిక్ లాజిక్ లేకపోలేదు. ఇక టికెట్ రేట్లకు సంబంధించిన ఛాంబర్ చెప్పిన ధరలు అమలు కావడం అనుమానమే. ఇవన్నీ కొలిక్కి రావడానికి ఇంకో వారం పది రోజులు పట్టేలా ఉంది. అప్పటిదాకా షూటింగులు మొదలుకానట్టే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి