iDreamPost

మా నాన్న చేసింది తప్పే.. అందుకే సారీ చెప్పమన్నా: రవిబాబు

  • Published Jun 10, 2024 | 12:11 PMUpdated Jun 10, 2024 | 12:21 PM

తాజాగా నటుడు,రవిబాబు రష్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రవిబాబు జోరుగా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తండ్రి అలా చేయడం చాలా పెద్ద పొరపాటు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా నటుడు,రవిబాబు రష్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రవిబాబు జోరుగా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తండ్రి అలా చేయడం చాలా పెద్ద పొరపాటు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Jun 10, 2024 | 12:11 PMUpdated Jun 10, 2024 | 12:21 PM
మా నాన్న చేసింది తప్పే.. అందుకే సారీ చెప్పమన్నా: రవిబాబు

టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ‘రవిబాబు’ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిందే. ఒక నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా విభన్న కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. ఇక ఈయన దివంగత నటుడు చలపతిరావు కూమారుడు అని అందరికి తెలిసిందే. ఇక తండ్రి వారసత్వంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన రవిబాబు తన నటనతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే వేసుకున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రల్లో మెప్పించిన రవిబాబు.. ఆ తర్వాత కాలంలో అమెరికాకు వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. మొదట అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ.. ‘అల్లరి’ అనే సినిమా చేశారు రవిబాబు.

ఇలా తన క్రియేటివీటీతో ఇప్పటి వరకు 15 పైగా చిత్రాలను డైరెక్ట్ చేసి దర్శకుడిగా మంచి మార్క్ ను వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రవిబాబు ఈటీవీ విన్ కోసం తెరకెక్కించిన చిత్రం ‘రష్’. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రవిబాబు గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తండ్రి గతంలో అలా చేయడం చాలా పెద్ద పొరపాటు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..తాజాగా నటుడు,రవిబాబు రష్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రవిబాబు జోరుగా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తండ్రి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, గతంలో ఓ సినిమా ఈవెంట్ లో తన తండ్రి దివంగత నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రవిబాబు తాజాగా రియాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. ‘మా నాన్న చేసిన ఆ లూజ్ కామెంట్స్ మీద నేనే ఇంత వరకు ఎక్కడ మాట్లాడలేదు. కానీ, నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ వీడియోలు,థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అయితే నిజానికి నేను అసలు ఆ టాపిక్ గురించి మా నాన్నతోనే మాట్లాడలేదు. అలాంటి బయట మీడియాతో కూడా మాట్లాడలేదు.ఇకపోతే మా నాన్నకి నేను చెప్పింది ఏమిటంటే.. మీరు మాట్లాడిన ఈ మాట కొంతమందిని నొప్పించి ఉంటే వాళ్లకి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా అని అన్నాను.ఇక ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఎందుకంటే.. మనం అందరం ఏదో ఒక సందర్భంలో టంగ్ స్లిప్ అవుతూ.. లూజ్‌గా మాట్లాడతాం. కానీ, ఆ మాటాలను గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. అయితే మా నాన్న టంగ్ స్లిప్ అయింది మీడియా ముందు. అది ఆయన దురదృష్టం.ఇక ఆ విషయానికి ఆయన సారీ చెప్పాడు కాబట్టి అక్కడితో ఆ టాపిక్ ఆగిపోయింది’అంటూ రవిబాబు అన్నారు.

ఇదిలా ఉంటే.. గతంలో చలపతిరావు నాగచైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో లాంఛ్ సమయంలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అయితే అక్కడ యాంకర్ చలపతి రావుకు అమ్మాయిలు మనఃశాంతికి హానికరమా అని యాంకర్ అడిగితే.. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై అప్పట్లో చలపతిరావుపై మహిళా సంఘాలు, పలువురు నటీనటులు ఫైర్ అయ్యారు. దీంతో చివరికి చలపతిరావు క్షమాపణలు చెప్పారు. మరి, తండ్రి పై వచ్చే కాంట్రవర్షికి ఇన్నాళ్లకు రియాక్ట్ అయి రవిబాబు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి