iDreamPost

వైద్యం వికటించి వివాహిత కన్నుమూత!

వైద్యం వికటించి వివాహిత కన్నుమూత!

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవల గుండెపోటు, పాముకాటు, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. కొన్నిసార్లు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత వైద్యం వికటించి కన్నుమూసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లాకు చెందిన శ్యామల స్వాతి (23) ఇంజక్షన్ వికటించి కన్నుమూసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. శ్యామల స్వాతి అనే వివాహిత గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. రక్త పరీక్షలు నిర్వహించగా శ్యామలకు మలేరియా, డెంగీ నెగిటీవ్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ప్లేట్ రేట్స్ తగ్గాయని, బీపీ డౌన్ కావడంతో నర్సింగ్ హోమ్ లోని డాక్టర్ చికిత్స చేశారు. ఈ క్రమంలోనే బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ చేశారు.

శ్యామలకు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆమె పరిస్థితి విషమించింది. మాటలు రాకపోవడం, పిచ్చిగా కేకలు వేస్తూ మరణించింది. దీంతో మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు డాక్టర్ ని నిలదీశారు. ఆయన చేసిన ఇంజక్షన్ వల్లనే ఆమె మరణించిందని నిలదీశారు. ఈ విషయంపై డాక్లర్ మాట్లాడుతూ.. తాను కేవలం బీపీ కంట్రోల్ ఇంజక్షన్ ఇచ్చానని దాని వల్ల ప్రమాదం లేదని అంటున్నారు.

కొన్నిసార్లు నెగిటీవ్ రిపోర్ట్ వస్తే పరిస్థితి విషమంగా మారి చనిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఆమె పరిస్థితి బాగా లేదని బీపీ తక్కువ కావడానికి ఇంజక్షన్ ఇచ్చి వరంగల్ కు తీసుకు వెళ్లమని కుటుంబ సభ్యులకు చెప్పానని అన్నారు. మరోవైపు తమ కుతురు మృతికి డాక్టర్ నిర్లక్ష్యం, ఇచ్చిన ఇంజక్షన్ కారణం అని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచఓ అయ్యప్పను వివరణ కోరగా బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతురాలికి భర్త, కూతు, కుమారుడు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి